హైదరాబాద్

నేటి నుంచి నామినేషన్ల పరిశీలన..22న ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అసెంబ్లీకి ముందస్తుగా జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా మొదటి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగిసింది. దాఖలుకు చివరిరోజు కావటంతో నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రిటర్నింగ్ అధికారి ఆఫీసులు జనంతో కిక్కిరిసిపోయాయి.
నామినేషన్ల స్వీకరణ ముగియటంతో మంగళవారం నుంచి వాటి పరిశీలన ప్రారంభం కానుంది. ఈ నెల 22వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. నామినేషన్లు సమర్పించే ఘట్టం ముగియటంతో టికెట్లు ఆశించి అసంతృప్తితో ఉన్న ఆశావహులను, రెబెల్స్ అభ్యర్థులను బుజ్జగించే ప్రక్రియను మంగళవారం నుంచి చేపట్టే అవకాశముంది. ఈ నెల 22వ తేదీ వరకు వారిని ఎదో రకంగా శాంతింపజేసి రెబెల్స్ నామినేషన్లను ఉపసంహరించేందుకు దాదాపు అన్ని పార్టీలకు చెందిన బడా నేతలు రంగంలో దిగనున్నారు.
అన్నింటికన్నా ఎక్కువ మంది బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన ఆశావహులు సికిందరాబాద్ నుంచి రెబెల్స్‌గా నామినేషన్లు సమర్పించారు. ఇందులో నగర మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి, మాజీ కార్పొరేటర్ ఆదం ఉమాదేవి, కాంగ్రెస్ నేత పి.లక్ష్మణ్‌గౌడ్, అలాగే బీజేపీ నుంచి ఎం.నాగేశ్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే టీఆర్‌ఎస్ నుంచి ఎస్.యాదగిరి కూడా నామినేషన్ సమర్పించారు.
నామినేషన్ల దాఖలకు సోమవారం చివరి రోజు కావటంతో ప్రముఖులు, పలువురు అపద్ధర్మ మంత్రులు ఎంతో ఆర్భాటంగా, అట్టహాసంగా వేలాది మందితో కలిసి నామినేషన్లు సమర్పించారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సనత్‌నగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా, కంటోనె్మంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణలతో పాటు పలు నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు కూడా రెబెల్స్‌గా పోటీ చేస్తూ నామినేషన్లను సమర్పించారు. ముఖ్యంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ నామినేషన్ ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. ఉదయం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తలసాని ఆ తర్వాత వేలాదిమంది కార్యకర్తలతో ఊరేగింపుగా వెళ్లి అమీర్‌పేట మండల రెవెన్యూ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇదే స్థానం నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా కూన వెంకటేశ్ గౌడ్ కూడా కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ను సమర్పించారు. కంటోనె్మంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ, ముషీరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ముఠా గోపాల్ నామినేషన్లు దాఖలు చేశారు.