హైదరాబాద్

ప్రచారం.. ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయిగూడ: ఉప్పల్ నియోజకవర్గంలో మహాకుటమి ఆభ్యర్ధి తూళ్ల వీరేందర్ గౌడ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ అతని భార్య దివ్యశ్రీ ప్రచారం నిర్వహించారు. దేవేందర్ గౌడ్ చేసిన అభివృద్ధి కనిపిస్తోంది. ఉప్పల్, చిలుకానగర్, హబ్సిగూడ, నాచారం డివిజన్ ఎంతో మందికి ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత దేవేందర్ గౌడ్ దక్కుతుందని తెలిపారు. కార్యక్రమంలో సతీష్, రహీమ్, రాములు యాదవ్, శరత్ చంద్ర, నిర్మల్ గౌడ్, రమేష్ గౌడ్, వౌనిక, ప్రతిభ, ఉమామహేశ్వరి, జయశ్రీ, జ్యోతి, రాజేశ్వరి పాల్గొన్నారు.
కుటుంబ పాలన స్వస్తికే ప్రజా కూటమి
వనస్థలిపురం: టీఆర్‌ఎస్ కుటుంబపాలనను గద్దె దించడానికే ప్రజా కూటమి ఏర్పాటు చేసినట్లు ఎల్బీనగర్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని సహారా కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు పార్టీలకు చెందిన యువకులను పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. వనస్థలిపురంలోని సీనియన్ సిటిజన్స్‌ను కలసి తమకు మద్దతు తెలపాలని, పలు కాలనీలు తిరుగుతూ తమకు ఓటు వేయాలని కోరారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధికి దూరమైందని, ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతుందని ఆరోపించారు. అవినీతి అక్రమ వసూళ్లను చూసి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు. కొప్పుల నర్సింహా రెడ్డి, మకటం సదాశివుడు పాల్గొన్నారు.
కూటమి వైపే ప్రజల చూపు
హయత్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకూటమి వైపే ప్రజల చూపు ఉందని ఎల్బీనగర్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వనస్థలిపురం డివిజన్ వెంకటరమణకాలనీ, రెడ్‌ట్యాంక్ లైబ్రరి, మన్సురాబాద్ సహార ఎస్టేట్‌లలో పర్యటించారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్‌లలో సీనియర్ సిటిజన్ల కోసం లైబ్రరిలు, యోగాసానలు చేసుకునేందుకు పార్కులలో సౌలభ్యాలు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. ఆటోనగర్ డంపింగ్ యార్డ్‌ను ఎత్తివేసినట్లు గుర్తుచేశారు. ఎల్బీనగర్ ప్రజలు మరోసారి అవకాశం కల్పిస్తే సుపరిపాలన అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాజు, సైదులు, సత్తయ్య, నరేష్, సునీత, స్వప్న, సైదమ్మ, లక్ష్మీదేవి పాల్గొన్నారు.
అభివృద్ధికి టీఆర్‌ఎస్ కృషి
జీడిమెట్ల: అన్ని రాష్ట్రాల ప్రజల అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేక్ అన్నారు. గాజులరామారం సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్ట డివిజన్ రింగ్ బస్తీలో కార్పొరేటర్ జగన్ ఆధ్వర్యంలో రాజస్థాన్‌కు చెందిన సోదరులు సుమారు 300 మంది వివేక్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వివేక్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ధ్యేయమని అన్నారు. కార్యక్రమంలో జైహింద్, పాపులు, ఇందిరా గౌడ్, మహమూద్, మహేందర్, వేణు యాదవ్, హజ్త్ అలీ, సునీల్ సింగ్, అరుణ్ సింగ్, అరవింద్ సింగ్ పాల్గొన్నారు. ఇంటింటికి కార్పొరేటర్ జగన్ తిరుగుతూ కరపత్రాలను పంచి కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బోగరాజేశ్, మహమూద్, విగ్నేశ్, శ్రీను, మల్లికాంబ, మేరీ, సుష్మా పాల్గొన్నారు.
చింతల్ డివిజన్ రంగానగర్‌లో పెద్దసంఖ్యలో మహిళలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వివేక్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ గెలుపుకోసం పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో వరప్రసాద్, మదుయాదవ్, నర్సయ్య, సీతారామయ్య, ఆంజనేయులు, సతీశ్, బాలచెన్నయ్య, రామకీ, కాశీ, అనంతరావు, వెంకటేశ్వర్లు, కుమార్, రమేశ్ పాల్గొన్నారు.
రంగారెడ్డి నగర్ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీ, పట్వారీ ఎన్‌క్లేవ్ కాలనీకి చెందిన సంక్షేమ సంఘం నాయకులు, కాలనీ వాసులు ఏర్పాటుచేసిన సమావేశానికి కేపీ వివేక్ హాజరయ్యారు. వివేక్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో చేసిన అభివృద్ధికి ఓటు వేయాలని కోరారు. నాలుగేళ్ల అధికారంలోనే ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తే మరోసారి అవకాశం కల్పిస్తే ఇంకెలా అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందో అర్థం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జయరామ్, శంకరయ్య, బంటి, మల్లికార్జున్, రాములు, మాధవ రెడ్డి, బాల్‌రాజ్, ఖాదర్, లక్ష్మీనాథ్, నర్సింగ రావు, మోహన్ లాల్, క్రాంతి, మహబూబ్ ఖాన్, శంకర్ పాల్గొన్నారు.
మజ్లిస్ పప్పులు ఉడకవు
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీ పప్పులు ఉడకవని టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ వ్యాఖ్యానించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌కు కంచుకోట అని, ఒక్క ఇటుక కూడా ఇక్కడ కదిలించడం మజ్లిస్‌కు అసాధ్యమని ప్రకాష్ గౌడ్ ఉద్ఘాటించారు. మంగళవారం రాజేంద్రనగర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. మజ్లిస్ కేవలం పాతనగరానికే పరిమితమై పని చేయాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు దాటాలన్న మజ్లిస్ కలలు నెరవేరడం అంత సులువు కాదని తెలిపారు. రాజేంద్రనగర్‌లో మజ్లిస్ ఎన్ని జిమ్మిక్కులు వేసినా మైనారిటీలు టీఆర్‌ఎస్ పక్షానే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో టీడీపీ చేపట్టిన అభివృద్ధే నేటికీ కొనసాగుతుందని మహాకూటమి అభ్యర్థి గణేష్‌గుప్త తెలియజేశారు. టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్ర అస్తవ్యస్తంగా తయారైందని ధ్వజమెత్తారు. మంగళవారం మహాకూటమి నాయకులతో గణేష్ గుప్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యపడుతుందని అన్నారు. కనీస వౌలిక సదుపాయాల నుంచి ప్రజల అవసరాలను తీర్చేవరకు టీడీపీ ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. రాజేంద్రనగర్ అభివృద్ధిలో టీడీపీ పాత్ర ఎంతో ఉందని అన్నారు. ఇతర నాయకులు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి జరిగిన నష్టం లేదని పేర్కొన్నారు. టీడీపీ హయాంలోనే హైదరాబాద్ నగరంగా మహానగరంగా రూపుదిద్దుకుందని అన్నారు. చంద్రబాబు నాయుడు కష్టపడి హైదరాబాద్ మహానగరాన్ని ఈ స్థాయికి తీసుకువస్తే టీఆర్‌ఎస్ నేతలు తమ పబ్బం గడుపుకోవడానికి, ఓట్ల రాజకీయాల కోసం విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
అభివృద్ధికి పట్టం కట్టాలి
తలకొండపల్లి: ఆంధ్రప్రదేశ్ నుంచి విడగొట్టి తెలంగాణ సాధించుకొవడానికి 60 సంవత్సరాలు పట్టింది.. బద్దశత్రువులైన కాంగ్రెస్, టీడీపీ - మహాకుటమి పేరుతో మళ్లీ మోసం చేయడానికి వస్తున్నారని టీఆర్‌ఎస్ అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి అన్నారు. తలకొండపల్లి, వీరన్నపల్లి గ్రామాలలో ముమ్మరంగా ఇంటి ఇంటి ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నర్సింహ, మండల టీఆర్‌ఎస్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, యాదయ్య, వజ్రం, కృష్ణయ్య, జగన్ రెడ్డి, అశోక్ గౌడ్, వెంకటయ్య పాల్గొన్నారు.
మల్లారెడ్డి గెలుపే లక్ష్యం
ఘట్‌కేసర్: మేడ్చల్ టీఆర్‌ఎస్ అభ్యర్ధి చామకూర మల్లారెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం మండల ఎన్నికల ప్రచార నిర్వాహణ బాధ్యతల కమిటీ సమావేశం జరిగింది. గ్రామాలలోని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్ధిక, సంక్షేమ పథకాలను వివరించి చైతన్య పర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బోయపల్లి కొండల్ రెడ్డి మాట్లాడుతూ ఘట్‌కేసర్ మండలంలో టీఆర్‌ఎస్‌కు భారీ ఆధిక్యతను సంపాదించేందుకు సైనికునిలా పని చేయాలని పిలుపునిచ్చారు. సహకార సంఘం చైర్మన్ గొంగళ్ల స్వామి, భిక్షపతి గౌడ్, బాలేశం, ఎదుగని కృష్ణమూర్తి, ఏనుగు సుదర్శన్‌రెడ్డి, కందుల కుమార్, బండారి అంజి గౌడ్, జంపాల రమేశ్, రేసు లక్ష్మారెడ్డి, మేకల నర్సింగ్ రావు, జగన్మోహన్ రెడ్డి, వేణుగోపాల్ పాల్గొన్నారు. మండల కేంద్రం శివారెడ్డిగూడ గ్రామంలో టీఆర్‌ఎస్ అభ్యర్ధి చామకూర మల్లారెడ్డిని గెలిపించాలని కోరుతూ మండల రైతు సమన్వయ సమితి అద్యక్షుడు కొంతం అంజిరెడ్డి తమ అనుచరులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
గచ్చిబౌలి: మాదాపూర్ డివిజన్‌లోని జూబ్లిగార్డెన్ కాలనీలో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్ధి ఆరెకపూడి గాంధీకి ఓటు వేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, మధుసుదన్, బ్రహ్మయ్య యాదవ్, రాజు, మనోహర్, లోకేష్, కృష్ణ, విల్సన్, ఇమ్రాన్, పర్వీన్, నళిని, శశిరేఖ, మొగులమ్మ పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి
మేడ్చల్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని మేడ్చల్‌లో గోదావరి జలాల సరాఫరాతో ఏళ్ల తరబడి నెలకొన్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని మేడ్చల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ఏల్లంపేట్‌లో గ్రామ నాయకుడు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీతో పాటు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరారు. జడ్పీటీసీ శైలజ, టీఆర్‌ఎస్ నాయకులు నందారెడ్డి, భాస్కర్ యాదవ్, సత్యనారాయణ, రాజమల్లా రెడ్డి, శివకుమార్, లింగం పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ నాయకులు మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలో ఇంటింటికి ముమ్మర ప్రచారం నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి శేఖర్ గౌడ్, నాయకులు మోహన్ రెడ్డి, ఈశ్వరయ్య, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి తదితరులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించి మల్లారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
బీఎస్‌పీ అభ్యర్థి హరీష్ ప్రచారం
కేపీహెచ్‌బీకాలనీ: కూకట్‌పల్లి బీఎస్‌పీ అభ్యర్థి పన్నాల హరీష్ చంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల కావ్య హరీష్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేపీహెచ్‌బీకాలనీ 6వ ఫేజ్‌లో పాదయాత్ర చేశారు. సాంబశివరావు, అశోక్, వెంకట్ రెడ్డి, కృష్ణార్జున్ రెడ్డి, వీవీకే రాజు, శివశంకర్ రెడ్డి, డీవీఎస్ రాజు, పద్మ, వాణి, సుగుణమ్మ, భారతి, గంగా, నారాయణ రావు, సత్యనారాయణ, రవినాథ్, తోట రమేష్, సుధా, రుక్మిణీ, శకుంతల, అరుణ పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌కే అన్ని వర్గాల మద్దతు
బేగంపేట: ముందస్తు ఎన్నికల్లో సనత్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌నే ఆదరిస్తున్నారని ఆపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం బేగంపేట డివిజన్‌లోని నూర్‌బాగ్ కాలనీ, ఓల్డ్ పాటిగడ్డ తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్లు ఉప్పల తరుణి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. తలసాని మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు రాష్టవ్య్రాప్తంగా వంద సీట్లు గెలిచి, మళ్లీ అధికారంలోకి రావటం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మహేశ్వరి, టీఆర్‌ఎస్ నేతలు సామా ప్రభాకర్ రెడ్డి, అత్తెల్లి మల్లికార్జున్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు అక్బర్, నరేందర్, కిషోర్ కుమార్, శ్రీహరి, నాగేందర్, శ్రీనివాస్ గౌడ్, రవీందర్ గౌడ్, హన్మంతు రావు పాల్గొన్నారు.