హైదరాబాద్

ప్రతి ఓటరుకు స్లిప్ ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటింటికీ ఈనెల 26వ తేదీ నుంచి ఓటరు స్లిప్‌లను పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ వెల్లడించారు. సికిందరాబాద్ హరిహర కళాభవన్‌లో బుధవారం సనత్‌నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గాలకు చెందిన బీఎల్‌ఓలకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో సుమారు 480 పైచిలుకు సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌లను గుర్తించామని, అక్కడి ప్రతి కదలికను రికార్డు చేసేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బంది ఇంటింటికెళ్లి పోలింగ్ స్లిప్‌లను పంపిణీ చేస్తున్నపుడు మరణించి, ఇల్లు మారిన, డబుల్‌గా నమోదైన ఓటర్లను గుర్తించాలని సూచించారు. తమ పరిధిలోని ప్రముఖులకు తప్పనిసరిగా ఓటరు స్లిప్‌లను అందించాలని ఆదేశించారు. తమ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అందించాల్సిన వౌలిక సదుపాయాలను కూడా బీఎల్‌ఓలు పరిశీలించాలని సూచించారు. ఎన్నికల విధి ఓటర్లకు అందజేస్తున్న కనీస వౌలిక సదుపాయాల కల్పనపై పరిశీలించామని చెప్పారు. ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న బీఎల్‌ఓలు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటరు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు, ఈ కేంద్రంలో కేవలం బీఎల్‌ఓలు మాత్రమే ఓటర్లకు తగిన సూచనలు చేయాలని, రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లను ఈ కేంద్రాల్లోకి అనుమతించరాదని సూచించారు. ఈసారి ఎన్నికల్లో సహాయకారిగా సేవలందించేందుకు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు అంగీకరించారని, బీఎల్‌ఓలు వారి పేర్లను సేకరించి, రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని సూచించారు. ఏ పార్టీకి అనుబంధం లేకుండా వివాదరహిత వ్యక్తులను మాత్రమే సహాయకారిగా స్వీకరించాలని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో రెండు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో ఒకటి మహిళలకు, మరొకటి పురుషులకు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల రెండో విడత ర్యాండమైజేషన్‌ను గురువారం నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. 3800 మంది బీఎల్‌ఓలు ఈనెల 26వ తేదీ నుంచి ఓటరు స్లిప్‌లను పంపిణీ చేయనున్నట్లు, ప్రతి ఓటరుకు విధిగా స్లిప్‌లను అందించాలని సూచించారు. ఈనెల 5వ తేదీన బూత్ ఏజెంట్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన తర్వాత ఈ స్లిప్‌ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఎన్నికల నిర్వాహణను పారదర్శకంగా నిర్వర్తించే బాధ్యత బీఎల్‌ఓలదేనని గుర్తుచేశారు.

‘ఎంపీ కొండా నిర్ణయం అభినందనీయం’
తాండూరు, నవంబర్ 21: టీఆర్‌ఎస్ నేత చెవేళ్ల ఎంపీ కొండా విశే్వశ్వర్ రెడ్డి సంచలన నిర్ణయం పట్ల తాండూరు నియోజకవర్గంలో హర్షాతి రేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఆలస్యంగానైనా ఎంపీ కొండా తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ టీఆర్‌ఎస్ క్రీయాశీల రాజకీయాలకు, ఎంపీ పదవికి సైతం రాజీనామా చస్తున్నట్లు వెల్లడించటం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నిదర్శనమని విద్యావంతులు, యువకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ను ఓ ఉద్యమ పార్టీగా భావించి టీజేఎస్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సూచనతో పాటు సీఎం కేసీఆర్ అభ్యర్థన మేరకు టీఆర్‌ఎస్‌లో చేరిన కొండా ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. గడచిన నాలుగేళ్ల కాలంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గత ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌లో చేరి ఏకంగా రవాణా శాఖ మంత్రి పదవి పీఠం అధిష్టించిన మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో ఇంటిపోరును భరిస్తున్న ఎంపీ కొండా విశే్వశ్వర్ రెడ్డి తన విజ్ణతతో పార్టీకి చెడ్డ పేరు రాకుండా, మంత్రి మహేందర్ రెడ్డితో విభేదాలు బయటకు రానియకుండా ఓపికతో ముందుకు సాగారని పేర్కొంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో వీర సైనికుల్లా పోరాడిన ఉద్యమకారులకు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మొండి చేయి చూపి ఉద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ, రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చేందుకు విఫల యత్నాలు చేసిన నాయకులకు పార్టీలో పెద్దపీట వేయటం, ఉద్యమ ద్రోహులను అందలాలు ఎక్కించటం, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు ఎలాంటి చేయుతను అందించక పోవటం వంటి ఉదంతాలను వౌనంగా భరిస్తూ వచ్చిన ఎంపీ కొండా ప్రస్తుత ముందస్తు ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న తరుణంలో టీఆర్‌ఎస్‌కి తన ఎంపీ పదవికి గుడ్‌బై చెబుతూ బయటకు రావటం అభినందనీయంగా ఉందని నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు అభినందిస్తున్నారు. ఈనెల 23న కొండా విశే్వశ్వర్ రెడ్డి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో చేరుతానని ప్రకటించటం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతుందన్న అభిప్రాయాలు తాండూరు రాజకీయుల్లో వ్యక్తం అవుతున్నాయి.

కుత్బుల్లాపూర్‌లో మిలాద్ ఉన్ నబీ వేడుకలు
జీడిమెట్ల, నవంబర్ 21: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు.