హైదరాబాద్

జోరుగా ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయిగూడ: ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే మహాకుటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆభ్యర్ధి తూళ్ల వీరేందర్ గౌడ్ అన్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి, బీఎన్‌రెడ్డినగర్, భరత్‌నగర్ కాలనీలో ఇంటింటికీ పాదయాత్ర నిర్వహించి మహాకుటమి అభ్యర్ధిని మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కుషాయిగూడ, సోనియాగాంధి నగర్, మారుతీనగర్, జమ్మిగడ్డ, న్యూ విరాట్‌నగర్‌లో సమస్యలు తీవ్రంగా ఉన్నయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వౌలిక సదుపాయలు కల్పించేలేని కేసీఆర్ ప్రభుత్వం.. చెరువులను అభివృద్ధి పేరుతో కబ్జాలకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధికి పట్టం కట్టాలంటే ఉప్పల్‌లో బలపరిచిన మహాకుటమి అభ్యర్ధి వీరేందర్ గౌడ్‌ను గెలిపించాలని వివిధ కాలనీ సంఘాల నాయకులు ప్రతిజ్ఞ చేశారు. టీడీపీ నాయకులు టీజీకే మూర్తి, సాంబమూర్తి గౌడ్, మల్లేష్ వంశరాజ్, చక్రిపాణి గౌడ్, శరత్ చంద్ర, రాంచంద్రర్ గౌడ్, బిక్షపతి, రాఘవేంద్రర్, వెంకటేష్, శ్యామ్, మల్లేష్, దినేష్, సత్యం, శ్రీ్ధర్, ప్రేమ్ పాల్గొన్నారు.
కూనకు పెరుగుతున్న మద్దతు
జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌కు రోజురోజుకి మద్దతు పెరుగుతోంది. టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు పలు డివిజన్‌లు, గ్రామాలలో సీనియర్ నాయకులు, అసోసియేషన్‌ల సభ్యులు పూర్తి మద్దతును ప్రకటిస్తున్నారు. బుధవారం బాచుపల్లి గ్రామంలోని కేహెచ్‌ఆర్ గార్డెన్‌లో తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం జరిగింది. సమావేశానికి టీడీపీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి హాజరయ్యారు. టీఆర్‌ఎస్ నుంచి రెబల్‌గా పోటీ చేస్తానని చెప్పి ప్రచారం చేసిన కొలను హన్మంత రెడ్డి.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున నామినేషన్ వేశాడు. తీరా చూస్తే మంగళవారం సాయంత్రం టీడీపీ నేత ఎల్.రమణ సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం బాచుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. కూన శ్రీశైలం గౌడ్, పెద్దిరెడ్డి మహాకూటమిని గెలిపించుకోవాలని అభివాదం చేశారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ మహాకూటమి తరఫున కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న శ్రీశైలంగౌడ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత టీడీపీ నేతలపై ఉందని అన్నారు. కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, పేద ప్రజల కోసం నాలుగు పార్టీలు ఏకమై ఎన్నికల బరిలో దిగారని, సమస్యల పరిష్కారం మహాకూటమితోనే సాధ్యమని చెప్పారు. కార్యక్రమంలో హన్మంత రావు, ఎల్లారెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, రషీద్‌బేగ్, లక్ష్మారెడ్డి, సాయితులసి, వీరబాబు, రాంమోహన్ రావు, నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.
సూరారం డివిజన్ ఏపీఐఐసీ కాలనీలో కుత్బుల్లాపూర్ మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ముమ్మర ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి మహాకూటమిని గెలిపించాలని కోరారు. పోలీస్ సురేందర్ రెడ్డి, వెల్లూరు శ్రీను, గాదె వినోద్, సురేశ్, రవిందర్ రెడ్డి, రాంబాబు, శ్రీరామ్ పాల్గొన్నారు. జీడిమెట్ల డివిజన్ పేట్‌బషీరాబాద్, యాదిరెడ్డి బండలో మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీశైలం గౌడ్ ఇంటింటి ప్రచారం చేశారు.
టీఆర్‌ఎస్‌లో మహిళలకు సముచిత స్థానం
మహిళలకు టీఆర్‌ఎస్ సముచిత స్థానం కల్పిస్తుందని కుత్బుల్లాపూర్ అభ్యర్థి కేపీ వివేక్ అన్నారు. కుత్బుల్లాపూర్ డివిజన్ దత్తాత్రేయ నగర్‌లో సూర్యప్రభ ఆధ్వర్యంలో టీడీపీ, కాంగ్రెస్ నుంచి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వివేక్ మాట్లాడుతూ ఒంటరి మహిళలకు రూ.వెయ్యి పెన్షన్ ఇచ్చి కేసీఆర్ అండగా నిలిచారని చెప్పారు. డ్వాక్రా గ్రూపులకు రుణాలు, షీటీమ్స్ ద్వారా మహిళలకు భద్రత ఇలా అనేక కార్యక్రమాలు మహిళల కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. కార్యక్రమంలో గౌరీష్, వీణాసింగ్, సునీత, సంగీత, నిర్మల, సిరీష, మాధవరెడ్డి, బాల్‌రాజ్, స్వామి, యాదగిరి, కిషోర్ చారి, సత్తిరెడ్డి, జయంచారి, రమేశ్, నజీర్, సిద్ధయ్య, హుస్సేన్, అరుణ, రాధ పాల్గొన్నారు. దత్తాత్రేయనగర్‌లో వివేక్ ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంచి ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. కార్యక్రమంలో సూర్యప్రభ, బాల్‌రాజ్, కిషోర్, యాదగిరి, సత్తిరెడ్డి, రమేశ్ పాల్గొన్నారు. కేపీ వివేక్‌కు కుత్బుల్లాపూర్ కురుమ సంఘం సభ్యులు మద్దతు తెలిపారు. వివేక్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని సంఘం తీర్మానించింది. కార్యక్రమంలో నార్లకంటి నాగేశ్, మల్లేశ్, మధు, వెంకటేశ్, బాల్‌రాజ్, అరున్‌కుమార్ పాల్గొన్నారు. సుభాష్‌నగర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. కార్యక్రమంలో రాజేందర్ రెడ్డి, సురేశ్ రెడ్డి, మహ్మద్ రఫీ, హుస్సేన్, యూసుఫ్, సిద్ధిక్, మన్నన్, యాకుబ్, ఖాజాపాషా, రబ్బాని పాల్గొన్నారు.