హైదరాబాద్

మోదీ, కేసీఆర్‌వి అన్నీ అబద్ధాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కాంగ్రెస్‌లో వజ్రేష్ యాదవ్‌కు సముచిత స్థానం * కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ వెల్లడి
ఉప్పల్, నవంబర్ 21: అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ అన్నదమ్ములేనని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ అన్నారు. మేడ్చల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం చివరి వరకూ ప్రయత్నించి భంగపడ్డ తోటకూర వజ్రేష్ (జంగయ్య) యాదవ్ తిరుగుబాటు అభ్యర్థిగా వేలాది మంది పార్టీ శ్రేణులతో నామినేషన్ వేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం అసంతృప్తులపై బుజ్జగింపు చర్యలు చేపట్టింది. కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ను దూతగా బోడుప్పల్‌కు పంపింది. బుధవారం పీర్జాదిగూడ కెనరానగర్‌లోని కాంగ్రెస్ నేత జంగన్న కార్యాలయానికి చేరుకున్నారు. మాజీ ఎంఎల్‌సీ రంగారెడ్డి, పీసీసీ కార్యదర్శి ఉద్దమర్రి నర్సింహా రెడ్డి, సింగిరెడ్డి రాంరెడ్డి, కట్ట జనార్ధన్ రెడ్డి, కూతాడి రవి, వందలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య వజ్రేష్ యాదవ్‌కు టిక్కెట్ కేటాయింపులో జరిగిన అన్యాయం వాస్తవమని ఒప్పుకున్నారు. ఈ అంశం పార్టీని నిరుత్సాహానికి గురిచేసింది. ఎన్నికల్లో మహా కూటమిదే అధికారమని, వజ్రేష్‌కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ, మన్మోహన్‌లేనని ప్రజలకు తెలుసన్నారు. టీఆర్‌ఎస్ గుర్తు అంబాసిడర్ కారు అని కార్ల కంపెనీ మూతబడిందని, టీఆర్‌ఎస్ పరిస్థితి ఇంతేనని, ఇక కేసీఆర్ ఇంటికి లేదా ఫామ్‌హౌజ్‌కే పరిమితమవుతారని జోస్యం చెప్పారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, బీసీలకు సైతం న్యాయం జరుగుతుందని తెలిపారు. అసంతృప్తులు విభేదాలు వీడి కాంగ్రెస్ విజయానికి సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు.

వేర్వేరు పార్టీల్లో.. ఒకే కుటుంబీకులు
కులకచర్ల, నవంబంర్ 21: ఒకే కుటుంబానికి చెందిన వారు వేర్వేరు పార్టీల్లో ఉంటూ ఏ పార్టీ వచ్చినా తమ కుటుంబానికే ప్రాతినిధ్యం లభించేలా బడా నాయకులు పావులు కదిపేవారు. వీరిని చూశాక తాము కూడా ఇలా ఎందుకు చేయకూడదని అనుకున్నారేమో కానీ అనేకమంది గ్రామ స్థాయిల్లో కూడా ఇలాంటి వ్యవహారాలను నెరపుతున్నారు. తాజాగా కులకచర్ల మండలానికి చెందిన పలువురు ఇదే తరహాలో అన్న ఒక పార్టీలో ఉంటే తమ్ముడు మరో పార్టీ కండువా కప్పుకుని ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇదేంటని అడిగితే అన్నది వేరే పార్టీ తనది వేరే పార్టీ అని చెప్పుకుంటున్నారు. బడాబడా నేతలు చేయగా లేని తాము చేస్తే తప్పేముందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అన్నదమ్ములే కాకుండా సొంత తండ్రీ కొడుకులు కూడా వేర్వేరు పార్టీల్లో ఉంటూ ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఒకింట్లోనే రెండు మూడు పార్టీలుంటే ఎవరొస్తే ఎవరికి ఓటేయాలో తాము మాత్రం ఎందుకు బహిర్గతం కావాలని ఓటర్లు కూడా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. బడా నేతల వారసత్వాలను ఈ తరహాలో కూడా చేయవచ్చునని చోటో మోటా కార్యకర్తలు కూడా చేసి చూయిస్తున్నారు. ఎన్నికలా మజాకా?

కేంద్ర పథకాలపై కేసీఆర్ తప్పుడు ప్రచారం: నడ్డా
శేరిలింగంపల్లి, నవంబర్ 21: భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర పథకాలుగా సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేశారని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జయప్రకాశ్ నడ్డా ధ్వజమెత్తారు. బుధవారం చందానగర్‌లోని క్రిస్టల్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నడ్డా మాట్లాడుతూ కేసీఆర్ సృష్టిస్తున్న వదంతులను తిప్పికొట్టాలని, టీఆర్‌ఎస్‌తో పూర్తి స్థాయిలో పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పేదల అరోగ్యానికి భరోసా కల్పించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేసీఆర్ అమలు చేయకపోవడాన్ని కేంద్ర మంత్రి నడ్డా తప్పుపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ లబ్దికోసం అసెంబ్లీని రద్దుచేసి తెలంగాణ ప్రజలను మోసం చేశాడని ధ్వజమెత్తారు. శేరిలింగంపల్లి అభ్యర్థి గజ్జల యోగానంద్, అసెంబ్లీ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి, రాష్ట్ర నాయకులు డా.నరేష్, కసిరెడ్డి భాస్కర రెడ్డి, భీమ్‌రావు, జ్ఞానేంద్ర ప్రసాద్, బాల్ద అశోక్, రవీంద్రప్రసాద్ దూబే, వసంత్‌కుమార్ యాదవ్, నరేందర్ రెడ్డి, నర్రా జయలక్ష్మి, నందనం వినయ, పార్వతి, ప్రభాకర్, శేరిలింగంపల్లి నాయకులు పాల్గొన్నారు.