హైదరాబాద్

ఎక్కువ స్థానాల్లో త్రి‘ముఖ’పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు సంబంధించి నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. నగరంలో ప్రతిష్టాత్మకమైన, ప్రముఖులు పోటీ చేసే నియోజకవర్గాల్లో పోటీ రసవత్తరంగా మారింది. పాతబస్తీలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మలక్‌పేట, న్యూసిటీలోని సికిందరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. నగర రాజకీయ ప్రముఖులు పోటీ చేస్తున్న ఖైరతాబాద్, సికిందరాబాద్, అంబర్‌పేట, మలక్‌పేట, జూబ్లీహిల్స్, నాంపల్లి, ముషీరాబాద్, సనత్‌నగర్, గోషామహల్ నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచి బరిలో దిగిన అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి దానం నాగేందర్ టీఆర్‌ఎస్ నుంచి, బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ నుంచి డా.దాసోజు శ్రావణ్‌కుమార్ బరిలో ఉన్నారు. కానీ టీఆర్‌ఎస్ రెబెల్ అభ్యర్థి కూడా ఇక్కడి నుంచి పోటీలో ఉండటం ప్రత్యర్థ అభ్యర్థులైన కాంగ్రెస్, బీజేపీలకు కొంత వరకు కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయి. గోషామహల్ నియోజవర్గంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్, బీజేపీ అభ్యర్థిగా టీ. రాజాసింగ్, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రేమ్‌సింగ్ రాథోడ్ బరిలో ఉన్నారు. గతంలో ఇక్కడి నుంచే గెలిచి, మంత్రి పదవీ చేపట్టిన ముఖేష్ గౌడ్ పదవీ పోయిన తర్వాత ఇక్కడి ప్రజలకు అందుబాటులో లేకుండాపోయారు. సరిగ్గా అదే సమయానికి రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలవటంతో నియోజకర్గంలోని కొన్ని సామాజికవర్గాల్లో పట్టు సాధించుకున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రేమ్‌సింగ్ రాథోడ్ కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉండి, ఓడిపోయిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండాపోయి, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రేమ్‌సింగ్ రాథోడ్‌కు రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ బోర్డు చైర్మన్ బాధ్యతలు అప్పగించిన తర్వాత మళ్లీ ప్రజల్లోకి వచ్చిన ఇపుడు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ముగ్గురు అభ్యర్థులకు ఆయా వర్గాల్లో కొంత వరకు పట్టున్నా, హిందూత్వ బలంగా ఉన్న గోషామహల్‌లో బీజేపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. మలక్‌పేట నియోజకవర్గంలో కూటమి తరపున టీజేఎస్ అభ్యర్థిగా టీడీపీ నేత ముజాఫర్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి ఆలే జితేంద్ర, మజ్లిస్ నుంచి బలాలా పోటీలో ఉన్నారు. ముషీరాబాద్‌లో కూడా డా.కే.లక్ష్మణ్‌కు ఈ సారి ఎదురీత తప్పేట్టు లేదు. ముప్పై ఏళ్ల రాజకీయ అనుభవం, స్థానికంగా మంచి పట్టున్న ముఠా గోపాల్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. స్థానికేతరుడైన అనిల్ కుమార్ యాదవ్ కూటమి అభ్యర్థిగా పోటీలో నిలవటంతో ఇక్కడ విజయం ఆశామాషీ ఏమి కాదన్పిస్తోంది. మిగిలిన స్థానాల్లో ఆసక్తికరమైన ద్విముఖ పోటీ నెలకొంది. ఈసారి నాంపల్లిలో మజ్లిస్‌కు కూడా ఎదురీత తప్పేలా లేదు. కాంగ్రెస్ నుంచి ఫిరోజ్‌ఖాన్ బరిలో ఉన్నారు. ఫిరోజ్‌ఖాన్ 2009లో ప్రజారాజ్యం, 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈసారి కూటమి అభ్యర్థిగా బరిలో దిగడంతో టీడీపీ క్యాడర్ అండ కూడా లభించటంతో మజ్లిస్ గెలుపు అంత సులువేమీ కాదన్న వాదనలు ఉన్నాయి. కార్వాన్, బహదూర్‌పురా, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురాల్లో ప్రత్యర్థులెవరున్నా, మజ్లిస్ అభ్యర్థులదే హవా కొనసాగుతోంది.

మహాకూటమి అభ్యర్థిని గెలిపించాలి
- ప్రొ.కోదండరామ్ -
జీడిమెట్ల, నవంబర్ 21: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. జీడిమెట్ల సబ్‌స్టేషన్ వద్ద జనసమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కోదండరామ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని కోదండరామ్‌ను శాలువాతో సన్మానించారు. కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్‌లో కూన శ్రీశైలం గౌడ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అశోక్ రెడ్డి పాల్గొన్నారు.