హైదరాబాద్

బయటకు రావాలంటే భయం..్భయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 10: ఉదయం ఎనిమిదైతే చాలు..బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. రోజురోజుకి భానుడి భగభగ పెరగటంతో ఎండలు మండిపోతున్నాయి. నగరంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావటంతో నగరం నిప్పుల కుంపటిలా మారింది. మున్ముందు ఎండలు మరింత మండిపోయే అవకాశముందని ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండలు మండిపోతూ, వేడి గాలులు వీయటంతో వృత్తి, ఉద్యోగాలకు బయటకు వచ్చేవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో పర్యావరణ వేత్తలు కూడా వాతావరణంలో మార్పులను అంచనా వేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావల్సి వస్తే, తగిన జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారీ కూ లీలు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు తప్పని పరిస్థితుల్లో ఎండలోనే తగు జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరవాసులు వడ దెబ్బ, వేడిగాలుల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తుగా వివిధ ప్రభుత్వ శాఖలు విస్త్రృత ప్రచారం చేపట్టాయి.
మున్ముందు ఎండలు మరింత పెరిగే అవకాశం వుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో పలువురు నగరవాసులు సిమ్లా, డార్జిలింగ్, గోవా వంటి చల్లటి ప్రదేశాలకు యాత్రలను ప్లాన్ చేసుకుంటున్నారు. పలు ప్రైవేటు ట్రావెల్స్ ఎజెన్సీలు కూడా ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి.
తగ్గిన చలివేంద్రాలు
ఎండలు మండిపోయే వేసవి కాలంలో ఒకప్పుడు నగరంలో అడుగడుగున ఉచితంగా మంచినీటిని సరఫరా చేసే చలివేంద్రాలు వేలిసేవి. కాలక్రమేనా, నీటికి డిమాండ్ పెరుగుతూ రావటంతో వాటి సంఖ్య బాగా తగ్గుతోంది. గతంలో కేవలం అక్కడ తాగేందుకేగాక, బాటిళ్లలో కూడా ఈ చలివేంద్రాలు తాగునీటిని అందించేవి. కానీ ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో వీటి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు చలివేంద్రాలు స్వచ్ఛంద సంస్థలు మాత్రమే ఏర్పాటుచేసేవి. కానీ కొద్ది సంవత్సరాల క్రితం రాజకీయ నేతలు కూడా పబ్లిసిటీ కోసం వాటిని ఏర్పాటుచేసి ఎంతో ఆడంబరంగా ప్రారంభించేవారు. గడిచిన రెండు, మూడు వేసవి కాలాల నుంచి వీటి సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే నగరంలో తాగునీటికి డిమాండ్, ధర పెరగటమే కారణమని చెప్పవచ్చు.
ప్రస్తుతం కొనుగోలు చేద్దామన్నా ట్యాంకర్లు అందుబాటులో లేని పరిస్థితులే చలివేంద్రాలు తగ్గేందుకు మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
చల్లదనం కోసం ఎన్ని మార్గాలో..!
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలుల బారిన పడకుండా ఉండేందుకు నగరవాసులు ఎన్నో మార్గాలను అనే్వషిస్తున్నారు. ఇందులో భాగంగా శీతలపానీయాలకు ఆదరణ పెరగ్గా, ఇంట్లో కాస్త చల్లటి వాతావరణాన్ని సమకూర్చుకునేందుకు వేలాది రూపాయలు వెచ్చిస్తూ ప్రజలు కూలర్లు, ఏసిలు కొనుగోలు చేస్తున్నారు.
రోజువారీ కూలీలు, మేస్ర్తిలు సైతం అప్పులు చేసి రూ. 10 వేల నుంచి రూ. 15వేల మధ్య ఖరీదున్న కూలర్లు కొనుగోలు చేస్తుండగా, కాస్త ఆర్థిక స్తోమత కల్గినవారు రూ. 30వేలు ఆపై ఖరీదు చేస్తున్న రకరకాల ఏసిలను కొనుగోలు చేస్తున్నారు. పలు పేరుగాంచిన బహుళ జాతి కంపెనీలు ఏసి, కూలర్ల కొనుగోళ్లను పెంచుకునేందుకు ఎన్నో ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించాయి. ఓ కంపెనీ కేవలం రూ. 99 చెల్లిస్తే ఏసి ఇచ్చే అరుదైన అవకాశం కూడా కల్పించింది.
‘నీటి’ కోసం వలసలు
హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకి నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చుతోంది. శివార్లలో వారానికోసారి అరకొర నీరు సరఫరా అవుతుండగా, కొన్ని ప్రాంతాల్లో అయిదారు రోజులకు ఓ ట్యాంకర్ ద్వారా చాలీచాలని నీటిని సరఫరా చేస్తున్నారు. ఉన్నవారికే తాగునీరు దొరక్క ఇబ్బందు లెదుర్కొంటుంటే ఇక చుట్టాలొస్తే ఎలా అంటూ తలలు పట్టుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, ఇప్పటికే హైదరాబాద్ నగరానికి ఇరుగుపొరుగు జిల్లాలైన మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో మంచినీటి సమస్య తీవ్ర రూపం దాల్చగా, అక్కడివారు నగరంలోని తమ చుట్టాల వద్దకు వస్తున్నారు. మరికొందరు నగరం నుంచి స్వస్థలాలైన తమ గ్రామాలకు తరలి వెళ్తున్నారు.