హైదరాబాద్

అర్థరాత్రి వ్యూహం ‘తెల్లారేనా’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జరగనున్న పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా, అభ్యర్థులు మాత్రం ఓట్ల కోసం అనేక రకాల పాట్లు పడుతున్నారు. పోలింగ్‌లో తమకు అనుకూలంగా ఓట్లు వేసేందుకు వీలుగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు, వారుచేసిన ప్రయత్నం శుక్రవారం ఉదయం ఎంత వరకు ఫలిస్తుందోనన్నది ప్రశ్నార్థకంగా మారింది. అభ్యర్థులు ఒక్కో నియోజకవర్గంలో కనిష్టంగా 199, గరిష్టంగా 310 పోలింగ్ బూత్‌లు ఉండగా, వాటిలో ఒక్కోదానికి ఇద్దరు చొప్పున పోలింగ్ ఏజెంట్లను నియమించే పనిలో ఉన్నారు. రహస్యంగా పోలింగ్ ఏజెంట్లకు, గల్లీ లీడర్లకు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులకు, బస్తీ,మురికివాడల కమిటీలకు రహస్య ప్రాంతాల్లో భారీగా నగదును చెల్లించారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరికివారే రహస్య శిబిరాలను ఏర్పాటు చేసుకుని మురికివాడలు, బస్తీలు, యువజన, కాలనీ సంక్షేమ సంఘాల వారీగా డబ్బులను, భారీగా మద్యాన్ని పంపిణీ చేసినట్లు సమాచారం. పోలింగ్ సందర్భంగా బుధవారం సాయంత్రం నుంచి 8వ తేదీ ఉదయం వరకు మద్యం షాపులను మూసివేసినా, అంతకు ముందుకు కొనుగోలు చేసిన మద్యం గురువారం మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో అక్రమంగా తరలించారు. ఒక్కో బస్తీ, మురికివాడ, కాలనీలు, అపార్ట్‌మెంట్లలోని ఓట్లను బట్టి వారికి భారీగా మద్యం, డబ్బును అభ్యర్థులు పంపిణీ చేశారు. నాంపల్లి పరిసర ప్రాంతంలో కోటి రూపాయలు, జూబ్లీహిల్స్ టీఆర్‌ఎస్ అభ్యర్థి డబ్బులు పంచుతుంగా, లక్షల్లో నగదు, ఓటరు స్లిప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులో దాదాపు ఎక్కువ మంది రాత్రంత శిబిరాలు నిర్వహించి, ఏజెంట్ల నియామకం, డబ్బుల పంపిణీ చేసేందుకు చేసిన శ్రమ పోలింగ్ రోజు ఎంత వరకు ఫలిస్తుందో? ఓటరు ఎవరినీ కరుణిస్తాడో? విజయం ఎవర్నీ వరిస్తుందో వేచి చూడాలి.
ఈ సారి జిల్లా ఎన్నికల యంత్రాంగమే ఓటరు స్లిప్‌లను పంచనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ ప్రకటించినా, క్షేత్ర స్థాయిలో ఓటరు స్లిప్‌ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. గురువారం సాయంత్రం ఏడు గంటల వరకు కూడా కొన్ని నియోజకవర్గాల్లోని అత్యధిక ప్రాంతాల్లో ఓటరు స్లిప్‌ల పంపిణీ జరగలేదు. కానీ జిల్లా ఎన్నికల అధికారి మాత్రం నగరంలోని 15 నియోజకవర్గాల్లో 99 శాతం స్లిప్‌ల పంపిణీ జరిగిందని ప్రకటించటం విడ్డూరం. ఈసారి ప్రభుత్వంచే అధికారికంగా నియమించిన ప్రభుత్వ సిబ్బందే స్లిప్‌లను పంపిణీ చేస్తుందన్న విషయం సామాన్యులకు తెలియక నోళ్లు తెరిచారు. మజ్లిస్, టీఆర్‌ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న పలు ప్రాంతాల్లో ఎన్నికల సిబ్బంది ఓటరు స్లిప్‌లను పంచుకుండా ఆయా పార్టీల నేతలు అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 5వ తేదీ సాయంత్రం ప్రచారానికి బ్రేక్ పడటంతో నేరుగా ఓటర్లను కలిసే స్లిప్‌ల పంపిణీ మార్గాన్ని సద్వినియోగం చేసుకునేందుకే కొన్ని ప్రాంతాల్లో నేతలు స్లిప్‌లు పంచుతున్న ఎన్నికల సిబ్బందిని తరిమేసినట్లు సమాచారం.