హైదరాబాద్

రికార్డు స్థాయిలో ఎంట్రీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సికిందరాబాద్ పీజీ రోడ్‌లోని జూలూరి వీరేశలింగం కల్యాణమండపంలో ఈ నెల 8వ తేదీ నుంచి పది వరకు ఆల్ ఇండియా బిలో 1500 ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తారు. టెట్రా సాఫ్ట్, ఎస్‌ఎంసిఎ ముంబయి, తెలంగాణ చెస్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టోర్నమెంట్‌లో దేశం నలుమూలల నుంచి రికార్డు స్థాయిలో చెస్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌లో 250 మంది పాల్గొంటున్నట్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మూడు లక్షల రూపాయల ప్రైస్ మనీ కలిగిన ఈ టోర్నమెంట్‌లో తొమ్మిది రౌండ్లపాటు మ్యాచ్‌లు కొనసాగుతాయి. టోర్నమెంట్‌లో 81 మందికి నగదు బహుమతులు అందజేయనున్నారు. మ్యాచ్‌లు ఉదయం 10 గంటల నుండి ప్రారంభమవుతాయి. స్పాట్ ఎంట్రీలను అనుమతిస్తారు.