హైదరాబాద్

నేడే పోలింగ్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎన్నికల ప్రచారం ముగిసింది. అభ్యర్థులు సభలు సమావేశాలు ముగియడంతో రహస్య మంతనాలు జోరుగా కొనసాగిస్తున్నారు.
గెలుపే ధ్యేయంగా ప్రత్యర్థి వర్గాలను సైతం మచ్చిక చేసుకునేందుకు అర్ధరాత్రులు వారివారి ఇళ్లల్లోకి వెళ్లి మద్దతు కోరడం, చివరి నిమిషంలో మనసు మార్చుకుంటారేమో అం టూ శత్రువులను సైతం ఆప్యాయంగా పలకరిస్తూ ఓటువేయాలని విజ్ఞప్తి చేస్తున్న సంఘటనలు కోకొల్లలు. రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 28,08,329 మంది ఓటర్లు ఉండగా వారు సజావుగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 3,073 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుచేయగా వాటి పరిధిలోని మరో 19 మంది పోలింగ్ స్టేషన్లు అదనంగా ఏర్పాటుచేశారు. ఎక్కువ శాతం ఓట్లు వున్న శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 575542 మంది ఓటర్లు ఉండగా, అతి తక్కువ ఓట్లు ఉన్న షాద్‌నగర్ నియోజకవర్గంలో 189064 మంది ఓటర్లున్నారు.
ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ కోసం ఐదు మంది, సాధారణ పరిశీలకులు నలుగురు, వ్యయ అంచనా పరిశీలకులు క్షేత్రస్థాయి పరిశీలకులు 438 మందిని నియమించారు. పోలింగ్ పరిస్థితులను ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎటువంటి తప్పిదాలు జరుగకుండా చర్యలు తీసుకునే యంత్రాంగం 391 వెబ్ కాస్టింగ్, 809 వెబ్ కెమెరాలు, 1893 వాల్‌మూమెంట్ కెమెరాలు ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నారు.
సర్వీసులో ఉన్న ఓటర్ల కోసం పోస్టల్ బ్యాలెట్‌ను పంపిణీ చేసిన యంత్రాంగం 9612 పోస్టల్ బ్యాలెట్లు పంపిణీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ నిర్వహణ సామగ్రి ఈవీఎంలతోపాటు సంబంధిత పోలింగ్ సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు 720 వాహనాలను వాడుతున్నారు. పోలింగ్ అనంతరం తిరిగి ఒకే చోటుకి ఈవీఎంలను తరలించి భద్రపరిచే కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో సమస్యాత్మకంగా ఉన్న 527 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ఎన్నిక జరిగేందుకు భద్రతా ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాలకు తరలించిన ఈవీఎంలో ఎలాంటి లోపాలు జరిగినా వెంటనే వాటి స్థానంలో మరొకటి ఏర్పాటుచేసేందుకు అదనపు ఈవీఎంలు ఏర్పాటు చేసుకున్నారు.
భద్రతతో..
రంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కేంద్రాల నుండి ఎన్నికల సిబ్బందితోపాటు ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక వాహనాలలో తరలించారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలకు వాహనానికి భద్రతా సిబ్బందిని తోడుగా పంపించిన జిల్లా యంత్రాంగం శుక్రవారం జరిగే పోలింగ్ సందర్భంగా క్షేత్రస్థాయిలో కావాల్సిన అన్ని సౌకర్యాలను జిల్లా యంత్రాంగం కల్పించింది. స్థానికంగా ఎటువంటి ఇబ్బందులు జరుగుకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.