హైదరాబాద్

డీఆర్‌సీ కేంద్రాల్లో నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నిర్వహించనున్న పోలింగ్‌కు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేసేందుకు నియోజకవర్గాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల నుంచి నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు అవసరమైన ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు, బ్యాలెట్ యూనిట్లతో పాటు ఇతర సామాగ్రిని ఆయా పోలింగ్ స్టేషన్ల ప్రెసైడింగ్ అధికారులకు అందజేస్తున్నారు. ఈ ప్రక్రియ మొదలుకుని, శుక్రవారం జరిగే మొత్తం పోలింగ్ ప్రక్రియతో పాటు తిరిగి ఈవీఎంలను డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు తరలించే ప్రక్రియను కూడా వీడియో చిత్రీకరించనున్నారు.
నగరంలోని 3873 పోలింగ్ కేంద్రాలు, ఐదు నియోజకవర్గాల్లో అదనంగా ఏర్పాటు చేసిన ఏడు అదనపు పోలింగ్ కేంద్రాలతో కలిపి మొత్తం 3880 పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్‌ల పరిశీలనలో భాగంగా సీలు తొలగింపు, పనితీరును సరి చూసుకోవటం వంటి అన్ని రకాల పరిశీలనలు జరిపిన తర్వాత సీసీ కెమెరాల నీఘాలో వీటిని అధికారులకు అప్పగిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి వీటిని డీఆర్‌సీ కేంద్రాలకు ప్రత్యేక రూట్‌మ్యాప్, భారీ బందోబస్తుతో తరలించి, స్ట్రాంగ్ రూంలో భద్రపరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా నియోజకవర్గాలకు ఏర్పాటు చేసిన డీఆర్‌సీ కేంద్రాల్లోనే 11న ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.