హైదరాబాద్

కౌంటింగ్‌కు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల చివరి, ఆఖరి ఘట్టం ఓట్ల లెక్కింపునకు జిల్లా ఎన్నికల యంత్రాంగం విస్త్రృత ఏర్పాట్లు చేస్తోంది. నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 15 కేంద్రాల్లో చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజాతీర్పు నిక్షిప్తమై ఉన్న ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాలకు తరలించారు. వాటిని ప్రత్యేక సాయుధ బలగాల బందోబస్తు మధ్య, సీసీ కెమెరాల నిఘా నీడలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూంలకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేయగా, మొత్తం లెక్కింపుకు కేంద్రానికి ఐదు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. వీటిని అపుడపుడు పోలీసు ఉన్నతాధికారులు తనిఖీ చేస్తున్నారు. అధికారుల సందర్శన, సాయుధ బలగాల విధి నిర్వహణ వంటి అన్ని ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేస్తున్నారు. ఈ చిత్రీకరణను నగర పోలీసు కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. ఇక ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి ఓ దఫా శిక్షణనిచ్చిన జిల్లా ఎన్నికల యంత్రాంగం రెండో దఫా శిక్షణను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ వెల్లడించారు. ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీ చేసిన వారిని మాత్రమే కౌంటింగ్ సెంటర్లలోకి అనుమతించనున్నట్లు వివరించారు. మొదటి అరగంట సేపు పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించిన తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కించనున్నట్లు ఆయన వివరించారు. ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేసి, ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్, అసిస్టెంటు కౌంటింగ్ సూపర్‌వైజర్, ఓ సూక్ష్మ పరిశీలకుడ్ని నియమించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉన్న రిటర్నింగ్ అధికారులకు కౌంటింగ్ కేంద్రంలో ప్రత్యేకంగా టేబుల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూం నుంచి ఈవీఎంలను తీసుకు వచ్చే ప్రక్రియ, సీలు తొలగింపు మొదలుకుని అందులోని ఓట్లను అభ్యర్థుల వారీగా ప్రకటించే అన్ని ప్రక్రియను వివిధ పార్టీలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లు, సూక్ష్మ పరిశీలకులు, కౌంటింగ్ సూపర్‌వైజర్, అసిస్టెంటు కౌంటింగ్ సూపర్‌వైజర్లు చూసేందుకు వీలుగా ప్రతి కౌంటింగ్ సెంటర్‌లో ఏర్పాట్లు చేశారు. లెక్కింపు ప్రక్రియను సీసీ టీవీ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, భారత ఎన్నికల సంఘం కూడా పర్యవేక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
నియోజకవర్గాల వారీగా డీఆర్‌సీ కేంద్రాలు
వ.నెం. నియోజకవర్గం డీఆర్‌సీ కేంద్రం
1 సికిందరాబాద్ ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓయూ
2 సనత్‌నగర్ ఓయూ ఎంబీఏ కాలేజీ, ఓయూ
3 కంటోనె్మంట్ వెస్లీ కాలేజీ, సికిందరాబాద్
4 అంబర్‌పేట రెడ్డి ఉమెన్స్ కాలేజీ, నారాయణగూడ
5 మలక్‌పేట అంబర్‌పేట మున్సిప్ స్టేడియం
6 చార్మినార్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి
7 యాకుత్‌పురా ఎగ్జిబిషన్ గ్రౌండ్, కమలానెహ్రూ పాలిటెక్నిక్
8 బహదూర్‌పురా సాంకేతిక భవన్, మాసాబ్‌ట్యాంక్
9 కార్వాన్ పాలిటెక్నిక్, మాసాబ్‌ట్యాంక్
10 గోషామహల్ ఉమెన్స్ కాలేజీ, కోఠి
11 జూబ్లీహిల్స్ విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, యూసుఫ్‌గూడ
12 ఖైరతాబాద్ విజయభాస్కర్ రెడ్డి స్టేడియం,యూసుఫ్‌గూడ
13 చాంద్రాయణగుట్ట నిజాంకాలేజీ లైబ్రరీ బిల్డింగ్, బషీర్‌బాగ్
14 నాంపల్లి ఎల్‌బీ స్టేడియం,బ్యాడ్మింటన్ స్టేడియం, బషీర్‌బాగ్
15 ముషీరాబాద్ ఎల్‌బీ స్టేడియం, బ్యాడ్మింటన్ స్టేడియం, బషీర్‌బాగ్