హైదరాబాద్

శిల్పారామంలో కనువిందుచేసిన నృత్యోత్సవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి: శిల్పారామం, ప్రసార భారతి దూరదర్శన్ సంయుక్తంగా నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన కనువిందు చేసింది. నృత్యోత్సవ్ పేరుతో ప్రదర్శిస్తున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలో ప్రొఫెసర్ అలేఖ్య పుంజల ప్రదర్శించిన రుద్రమదేవి, స్వాతి సోమనాథ్ రాసగోపాలం నృత్య ప్రదర్శన ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసింది. కాకతీయుల సామ్రాజ్య రాణి రుద్రమదేవి జీవిత చరిత్ర ఆధారంగా నృత్య రూపకంగా తీర్చిదిద్దిన తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ అలేఖ్య పుంజల రాణి రుద్రమదేవి తన పాత్రకి న్యాయం చేసి స్ర్తి జాతికి ఒక ఆణిముత్యం, ఆదర్శరూణిగా జీవించి చూపించారు. అలనాటి నృత్య సంప్రదాయం పేరిణి తాండవం, యుద్ధ సన్నివేశాలు గగుర్పొడిచాయి. జయదేవు రచించిన గీత గోవిందం ఆధారంగా రచించిన రాసగోపాలం, నృత్య రూపకంలో స్వాతి సోమనాధ్ రాధగా శ్రీకృష్ణ మధుర భక్తి, భక్తివైరాగ్యం, శ్రీకృష్ణ విరహం, జీవాత్మ పరమాత్మకు సంబంధించిన రస అనుభావాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. నృత్య ప్రదర్శన అనంతరం దూరదర్శన్ డైరెక్టర్ విజయ్ భగవాన్, శిల్పారామం పత్యేక అధికారి కిషన్‌రావు ఘనంగా సన్మానించారు.
ముగిసిన ‘వాగ్గేయ గాన సప్తాహము’
కాచిగూడ, డిసెంబర్ 9: సమ్మోహన సంగీత విద్యాలయం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వాగ్గేయ గాన సప్తాహము’ ముగింపు సభ ఆదివారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి బీసీ స్టడి సర్కిల్ డైరెక్టర్ ఎన్.బాలచారి, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, ప్రముఖ గాయని టీవీ సుందరవల్లి, సంస్థ అధ్యక్షురాలు డా.వై.రమాప్రభ పాల్గొన్నారు. వారం రోజుల పాటు వాగ్గేయ గాన సప్తాహము కార్యక్రమం నిర్వహించి గాయనీ, గాయకులను ప్రొత్సహించడం అభినందనీయని అన్నారు. సంగీత గురువు అనివెళ్ల వాణి శిష్య బృందం అలపించిన ‘్భద్రగిరి రామదాసు రామనామ’ సంకీర్తనలు అలరించాయి.