హైదరాబాద్

కౌటింగ్‌కు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల చివరి ఘట్టమైన ఓట్ల లెక్కింపులో నేడు ప్రజాతీర్పు వెలువడనుంది. నగరంలోని మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మొత్తం 313 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి, స్వతంత్రులుగా బరిలో నిలిచారు. వీరిలో విజయం ఎవర్ని వరిస్తోంది? అసెంబ్లీకెళ్లే వారెవరు? అనే ఉత్కంఠకు నేటి మధ్యాహ్నాం వరకు తెరపడే అవకాశముంది. గత 2014 ఎన్నికల్లో 51 శాతం ఓట్లు పోలు కాగా, ఈసారి 51 శాతం మాత్రమే పోల్ కావటంతో కాస్త ముందుగానే లెక్కింపు ముగించే అవకాశముంది. ఇందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ కేంద్రాల మాదిరిగానే కౌంటింగ్ సెంటర్ల ఆవరణలో ఆంక్షలను అమలు చేయనున్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన లెక్కింపు 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో అభ్యర్థి తరపున 14 మంది కౌంటింగ్ ఏజెంట్లకు అనుమతి ఇచ్చారు. స్ట్రాంగ్ రూంలకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేయగా, మొత్తం లెక్కింపుకు కేంద్రానికి ఐదు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే లెక్కింపులో భాగంగా మొదటి అరగంట సేపు పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించి, ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ వెల్లడించారు. ఒక్కో కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేసి, ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్, అసిస్టెంటు కౌంటింగ్ సూపర్‌వైజర్, ఓ సూక్ష్మ పరిశీలకుడిని నియమించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉన్న రిటర్నింగ్ అధికారులకు కౌంటింగ్ కేంద్రంలో ప్రత్యేకంగా టేబుల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి రౌండ్‌కు ఓ సారి ఫలితాలను ప్రకటించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూం నుంచి ఈవీఎంలను తీసుకువచ్చే ప్రక్రియ, సీలు తొలగింపు మొదలుకుని అందులోని ఓట్లను అభ్యర్థుల వారీగా ప్రకటించే అన్ని ప్రక్రియను వివిధ పార్టీలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లు, సూక్ష్మ పరిశీలకులు, కౌంటింగ్ సూపర్‌వైజర్, అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్‌వైజర్లు చూసేందుకు వీలుగా ప్రతి కౌంటింగ్ సెంటర్‌లో ఏర్పాట్లు చేశారు. వెబ్‌కాస్టింగ్ చేయనున్న ఈ లెక్కింపు ప్రక్రియను సీసీ టీవీ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, భారత ఎన్నికల సంఘం కూడా పర్యవేక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. మొత్తం ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయనున్నారు.
నియోజకవర్గం మొత్తం ఓట్లు పోలైన ఓట్ల శాతం లెక్కింపు కేంద్రం

ముషీరాబాద్ 274073 51.34% ఎల్‌బీ స్టేడియం, బషీర్‌బాగ్
మలక్‌పేట 293481 55.54% మున్సిపల్ స్టేడియం, అంబర్‌పేట
అంబర్‌పేట 241524 55.20% రెడ్డి ఉమెన్స్ కాలేజీ, నారాయణగూడ
ఖైరతాబాద్ 263340 54% కోట్ల విజయభాస్కర్ రెడ్డి, యూసుఫ్‌గూడ
జూబ్లీహిల్స్ 341522 54.60% కోట్ల విజయభాస్కర్ రెడ్డి, యూసుఫ్‌గూడ
సనత్‌నగర్ 228941 52.63% ఓయూ ఎంబీఏ కాలేజీ, ఓయూ క్యాంపస్
నాంపల్లి 303497 44.02% ఎల్‌బీ బ్యాడ్మింటన్ స్టేడియం, బషీర్‌బాగ్
కార్వాన్ 314355 50.89% ప్రభుత్వ పాలిటెక్నిక్, మాసాబ్‌ట్యాంక్
గోషామహల్ 233155 50.28% ఉమెన్స్ కాలేజీ, కోఠి
చార్మినార్ 200418 46.03% ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి
చాంద్రాయణగుట్ట 293496 48% నిజాంకాలేజీ లైబ్రరీ బిల్డింగ్, బషీర్‌బాగ్
యాకుత్‌పురా 333570 45% ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, కమలా నెహ్రూ పాలిటెక్నిక్
బహదూర్‌పురా 259210 49.50% సాంకేతిక భవన్, మాసాబ్‌ట్యాంక్
సికిందరాబాద్ 237178 57% ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓయూ క్యాంపస్
కంటోనె్మంట్ 239728 48.90% వెస్లీకాలేజీ, సికిందరాబాద్