హైదరాబాద్

కొద్ది గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపుకు భారీ ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల శాతాన్నిబట్టి ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను లెక్కించేందుకు 14 టేబుళ్లను ఏర్పాటుచేసి రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఇబ్రహీంపట్నంలో పోలైన 1,95,973 ఓట్లను 300 పోలింగ్ కేంద్రాల్లో 22 రౌండ్లుగా లెక్కిస్తారు. ఎల్బీనగర్‌లో 509 పోలింగ్ కేంద్రాల్లో పోలైన 2,43,603 ఓట్లను 37 రౌండ్లలో లెక్కిస్తారు. మహేశ్వరం నియోజకవర్గంలో పోలైన 2,33,105 ఓట్లను 455 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 33 రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని 441 పోలింగ్ కేంద్రాల్లో పోలైన 2,50,493 ఓట్లను 32 రౌండ్లలో లెక్కిస్తారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పోలైన 2,79,209 ఓట్లను 557 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 42 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. చేవెళ్ళ నియోజకవర్గంలోని 292 పోలింగ్ కేంద్రాల్లో పోలైన 1,76,359 ఓట్లను 21 రౌండ్లలో లెక్కిస్తారు. కల్వకుర్తిలోని 257 పోలింగ్ కేంద్రాల ద్వారా పోలైన 1,76,806 ఓట్లను 19 రౌండ్లలో లెక్కిస్తారు. షాద్‌నగర్‌లో పోలైన 1,65,550 ఓట్లనున 242 పోలింగ్ కేంద్రాల ద్వారా 18 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. వీటికి సంబంధించి నియమించిన అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తిచేశారు. పోలింగ్ ఏజెంట్లకు గుర్తింపు కార్డులను పంపిణీ చేయటంతోపాటు నిబంధనల ప్రకారం వారికి అనుమతులిస్తూ ఓట్ల లెక్కింపు కేంద్రానికి అనుమతినిస్తారు. అభ్యర్థులు కూడా తమ భవితవ్యం ఏమిటో అంటూ ఉత్కంఠ పరిస్థితుల్లో కొన్ని గంటల్లో తేలనున్న ఫలితాలపై అంచనాలు వేస్తూ ఎవరికి వారు గెలుస్తామన్న ధీమాలను వ్యక్తం చేస్తున్నారు.

ఆటోడ్రైవర్ నిజాయితీ
*విదేశీయుడి నగదు, ఫోన్ పోలీసులకు అప్పగింత
ఖైరతాబాద్, డిసెంబర్ 10: నగరానికి చెందిన ఆటోడ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. తన ఆటోలో ప్రయాణించిన విదేశీయుడు మరిచిపోయిన నగదు, ఫోన్‌ను పోలీసులకు అందజేశాడు. వివరాల్లోకి వెళితే.. ముషీరాబాద్ గాంధీనగర్‌కు చెందిన ఉమేష్ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తాడు. అమెరికాకు చెందిన జెమ్మి మెక్‌గ్నో సోమవారం మధ్యాహ్నం సోమాజిగూడలోని పార్క్ హోటల్ నుంచి లైఫ్‌స్టైల్ బిల్డింగ్ వరకు ప్రయాణించాడు. దిగే సమయంలో రూ.20వేలు ఉన్న పర్సు, ఫోను మరిచిపోయాడు. అనంతరం గమనించిన ఉమేష్ వెంటనే పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పి వాటిని అందజేశాడు. పర్సులోని ఐడీ కార్డు ఆధారంగా అమెరికా దేశస్థున్ని సంప్రదించిన పోలీసులు విషయం వివరించి నగదు, ఫోను అందజేశారు. ఆటోడ్రైవర్ నిజాయితీకి మెచ్చిన మెక్, పోలీసులతో కలిసి రూ.4వేల రివార్డు అందజేశారు. హైదరాబాద్ మహానగరంలో ఆటో డ్రైవర్ నిజాయితీగా వ్యవహరించడం తనకు ఎంతగానో ఆనందాన్ని ఇచ్చిందని మెక్ పేర్కొన్నారు.