హైదరాబాద్

పద్మారావు ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లష్కర్ నియోజకవర్గం నుంచి మరోసారి ఘనవిజయం సాధించి టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మారావు తమ సత్తాను చాటారు. ఓట్ల లెక్కింపు ప్రతి రౌండ్‌లో తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ పూర్తి ఆధిక్యత దిశగా దూసుకుపోయారు. ఎట్టకేలకు 40వేలకు పైగా మెజార్టీ సాధించి గ్రేటర్‌లో తమకు ఎదురులేదని పద్మారావు సవాల్ విసిరారు. మహాకూటమి నుంచి స్థానిక నేతలను కాదని చివరి నిముషంలో మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ను పద్మారావుకు ధీటైన అభ్యర్థి అని భావించి పోటీలోకి దింపారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు ప్రచారంలో హోరెత్తించినా సికిందరాబాద్ నియోజకవర్గ ప్రజలు మాత్రం పద్మారావువైపే మొగ్గుచూపారు. అభివృద్ధి తెరాస ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, అందులో మాస్ నాయకుడు పద్మారావు ఆధ్వర్యంలోనే సికిందరాబాద్ నియోజకవర్గం సంపూర్ణ అభివృద్ధి సాథిస్తుందన్న నమ్మంతో మరోసారి ఘన విజయాన్ని చేకూర్చి పెట్టారు. నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత రెట్టింపు ఉత్సాహంతో బాధ్యతతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత బాధ్యతగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి లష్కర్ నియోజకవర్గాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా చేస్తామని పద్మారావు పేర్కొన్నారు.