హైదరాబాద్

మెగాసిటీలు కొన్ని దేశాలకంటే పెద్దవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రపంచంలోని పలు మెగాసిటీలు జనాభా, సంపదలో కొన్ని చిన్న చిన్న దేశాల కన్నా పెద్దగా, బలంగా ఉన్నాయని హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఐఐఐటీ, యూనివర్శిటీ ఆఫ్ టోక్యోల సంయుక్త ఆధ్వర్యంలో ‘మెగాసిటీల్లో భద్రతకు సరికొత్త టెక్నాలజీ’ అనే అంశంపై మూడురోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెగాసిటీల్లో పెరుగుతున్న జనాభాకు తగిన విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, మరింత భద్రత పెరుగుతోందని వివరించారు. ముఖ్యంగా మానవ తప్పిదాలు, విపత్తుల నివారణ వంటి అంశాలకు సంబంధించి టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపతుందన్న అంశంపై ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. ఇదే తరహాలో హైదరాబాద్ మెట్రోరైలు అత్యంత ఆధునికమైన, ప్రపంచ ప్రమాణాలతో కూడిన భద్రతతో ఏర్పాటు చేసినట్లు వివరించారు. ముఖ్యంగా మహిళలు, యువతులకు మెట్రోరైల్‌లో అత్యంత ఆధునిక భద్రతను కల్పించినట్లు తెలిపారు. భూకంపం, అగ్నిప్రమాదం, మానవ తప్పిదాలు, బాంబు పేలుళ్లు, విషవాయువుల విడుదల, తీవ్రవాదుల దాడులు వంటి వాటినుంచి కూడా మెట్రోరైలులో ఎంతో ముందుచూపుతో భద్రత కల్పించినట్లు తెలిపారు. టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు ఈ అంశాలపై మరింత అవగాహన సమకూర్చుకోవాలని సూచించారు. టోక్యో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కిమిరో మెగురో మాట్లాడుతూ, టోక్యోలో ఎక్కువగా భూ కపంపాలు వస్తున్నందున, అక్కడ తక్కువ ఖర్చు, సమయంతో ఇళ్లను నిర్మించుకుంటున్నట్లు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మూడురోజుల పాటు జరగనున్న ఈ సదస్సు మొదటిరోజు కార్యక్రమంలో ఐఐఐటీ సీనియర్ ప్రొఫెసర్ ప్రొ.ప్రదీప్‌కుమార్, ప్రపంచంలోనే పేరుగాంచిన పలు విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు పాల్గొన్నారు.