హైదరాబాద్

దారుస్సలాంలో సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ ఏడు సీట్లను కైవసం చేసుకోవడంతో నిర్వహించిన విజయోత్సవ సభ విజయవంతంగా ముగిసింది. పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనడంతో దారుస్సలాం ప్రాంగణం జనంతో నిండిపోయింది. ఈ సభకు దేశ నలుమూలల నుండి మైనార్టీ నాయకులు, మత గురువులు విచ్చేశారు. చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్‌ను, యాకుత్‌పురా ఎమ్మెల్యే సయ్యద్ పాషా ఖాద్రీ, చాంద్రాయణగుట్ట నుండి అక్బరుద్దీన్ ఓవైసీ, కార్వాన్ నుంచి కౌసర్ మహ్మద్ ఖాన్, మలక్‌పేట్ నుంచి అహ్మద్ బీన్ అబ్దుల్లా బలాల, నాంపల్లినుంచి మిరాజ్ జాఫర్ హుస్సేన్, బహదుర్‌పురా నుండి మోజంఖాన్ ప్రత్యర్థులపై ఘనవిజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపొందిన మజ్లిస్ అభ్యర్థులు తమకు ఓటు వేసి గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. పాతబస్తీ ప్రజలు త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ సీటును కూడా గెలుచుకునేందుకు మజ్లిస్‌కు మద్దతు పలకాలని అక్బరుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. దారుస్సలాం పార్టీకే పరిమితం కాకుండా, ముస్లిం యువత విద్యపరంగా రాణించేందుకు నిలయంగా మారిందని అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. సమావేశంలో పార్టీ అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీతోపాటు ఎమ్మెల్యేలను సత్కరించారు.

మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు

హైదరాబాద్, డిసెంబర్ 12: మంత్రి కల్వకుంట్ల తారకరామారావును టీఆర్‌ఎస్ పార్టీ నూతన ఎమ్మెల్యేలు కలిశారు. చేవెళ్ల, కొడంగల్, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేలు యాదయ్య, నరేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావులతో పాటు మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు ధర్మన్నగారి వెంకట్‌రెడ్డి, అనంతరెడ్డి కేటీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.