హైదరాబాద్

కేసీఆర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ట్రాఫిక్ మళ్ళింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండవసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం రాజ్‌భవనంలో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రాజ్‌భవనం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్ళిస్తున్నట్లు ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. రాజ్‌భవనం మూడవ గేట్ నుంచి పరిపాలన భవనం వైపు కొత్తగా ఎన్నికైన అసెంబ్లీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వెళ్ళాల్సి ఉంటుంది. దిల్‌కుష్ గెస్టుహౌస్‌లో మీడియా వాహనాల కోసం, ఎంఎటీఎస్ పార్కింగ్ లాట్‌లో వీవీఐపీల కోసం, మెట్రోరెసిడెన్సీ నుంచి ఎన్‌ఎఎస్‌ఆర్ స్కూల్‌లో సింగిల్ లైన్ పార్కింగ్, లేక్‌వ్యూ గెస్టుహౌస్ నుంచి వీవీ విగ్రహం చౌరస్తాలో సింగిల్ లైన్ పార్కింగ్ ఏర్పాటుచేశారు. పాస్‌లు ఉన్న వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు.