హైదరాబాద్

నూతన భవనాలకు ఆస్తిపన్నుపై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : మహానగరంలో నూతనంగా నిర్మించిన ప్రతి భవనాన్ని ఆస్తి పన్ను చెల్లింపు పరిధిలోకి తీసుకువచ్చేందుకు వెంటనే మదింపు ప్రక్రియను చేపట్టాలని బల్దియా కమిషనర్ దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల మొదటి వారం నుంచి బల్దియా అధికారులు ఓటరు జాబితా సవరణ, స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే అవకాశమున్నందున, ఈ నెలాఖరులోపు నగరంలోని 30 సర్కిళ్లలో నూతనంగా నిర్మిస్తున్న, నిర్మించిన భవనాలను ఆస్తిపన్ను చెల్లింపు పరిధిలోకి తీసుకువస్తూ మదింపు ప్రక్రియను పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన స్వచ్ఛ సర్వేక్షణ్, ఆస్తిపన్ను వసూళ్లు అంశాలపై ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన భవనాలు, ఇళ్లనన్నింటికీ ఆస్తిపన్ను మదింపు ప్రక్రియను యుద్దప్రాతిపదికన చేపట్టి, ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. గడిచిన మూడు నెలలుగా జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండటంతో ఆస్తిపన్ను సేకరణ మందకొడిగా సాగిందని, ఈ నెలాఖరులోపు కనీసం రూ. వంద కోట్ల మేరకు పన్ను వసూలు చేయాలని ఆయన ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నివాసేతర భవనాలకు కమర్షియల్ ఆస్తిపన్నును విధించి, వందకు వంద శాతం వసూలు చేయాలని సూచించారు. పన్ను వసూళ్లపై ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1500 కోట్ల ఆస్తిపన్ను లక్ష్యం కాగా, మరో రూ. 755 కోట్లు వసూలు చేయాల్సిన లక్ష్యం మన ముందుందని ఆయన అధికారులు, సిబ్బందికి గుర్తు చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2019లో ఈసారైనా మెరుగైన ర్యాంకును సాధించేందుకు వీలుగా జీహెచ్‌ఎంసీ నిర్వహించే స్వచ్ఛ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు కమిషనర్ దాన కిషోర్ వార్డుల వారీగా ప్రత్యేకంగా అధికారులను నియమించారు.