హైదరాబాద్

200 ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: మహానగరంలో క్రిస్మస్ పండుగ వేడుకలను మొత్తం 200 ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ వెల్లడించారు. క్రిస్మస్ పండుగ ఏర్పాట్లు, దుస్తుల పంపిణీ అంశాలకు సంబంధించి ఆయన శుక్రవారం బల్దియాలో ప్రత్యేక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
డిప్యూటీ మేయర్ బాబా మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నగరంలోని ప్రతి ప్రాంతంలో పేద కుటుంబాలకు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రత్యేకంగా గిఫ్ట్ ప్యాక్‌లను అందించనున్నట్లు, జీహెచ్‌ఎంసీ తరపున ప్రత్యేకంగా క్రిస్మస్ విందును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీ కోసం కార్పొరేటర్లు తమ డివిజన్ల పరిధిలోని ఒక్కో చర్చిని ఎంపిక చేసుకోవాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం రెండు ప్రాంతాలను సంబంధిత ఎమ్మెల్యేలతో కలిసి ఎంపిక చేయాలని సూచించారు. ప్రతి ప్రాంతంలో 500 గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పంపిణీలో నిరుపేదలు, దివ్యాంగులు, వితంతువులు, అనాథలకు ప్రాధాన్యతనివ్వనున్నట్లు తెలిపారు. దీనికి తోడు కొత్త దుస్తులు పంపిణీ చేసి ప్రత్యేకంగా క్రిస్మస్ ఫీస్ట్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీ సక్రమంగా, సజావుగా శాంతియుతంగా జరిగేందుకు డిప్యూటీ కమిషననర్లు, సంబంధిత కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, చర్చల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని సూచించారు. జీహెచ్‌ఎంసీలోని 200 ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతంలో 500 చొప్పున మొత్తం లక్ష మందికి గిఫ్ట్ ప్యాక్‌లను అందించనున్నట్లు తెలపారు. ప్రతి గిఫ్ట్ ప్యాక్‌లో ఒక పాలిస్టర్ ప్యాంట్, షర్ట్, ఒక చీర, జాకెట్ పీస్, సెల్వార్ కమీజ్‌లు ఉంటాయని పేర్కొన్నారు. క్రిస్మస్ ఫీస్ట్‌లో ఎంపిక చేసిన వేదికల్లో, ఒక్కోదానిలో 500 మందికి బిర్యానీ, రైతా, స్వీట్ కేక్‌లను అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం నాంపల్లిలోని హాజ్ భవన్ నుంచి క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీ జరుగుతుందని డిప్యూటీ మేయర్ వెల్లడించారు. సమావేశంలో కమిషనర్ దాన కిషోర్, మైనారిటీ శాఖ కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా, మైనార్టీ శాఖ డైరెక్టర్ షానహాజ్ హుస్సేన్, కార్పొరేటర్లు, వారు, ఏరియా కమిటీ సభ్యులు, జీహెచ్‌ఎంసీ అధికారులు హాజరయ్యారు.