హైదరాబాద్

18 నుంచి ఆలిండియా పోస్టల్ కబడ్డీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఏపీ సర్కీల్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈనెల 18 నుంచి 21 వరకు ఆలిండియా పోస్టల్ శాఖ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తారు. టోర్నమెంట్‌లో పాల్గొనే తెలంగాణ సర్కీల్ జట్టుకు కెప్టెన్‌గా బీ.విఘ్నేష్ యాదవ్, కోచ్‌గా ఎం.నాగేశ్వరరావు, మేనేజర్‌గా వీ.చంద్రరావు వ్యవహరిస్తారు. జట్టుకు ఎంపికై వారిలో జీ.హెమంత్ రావు, ఎస్.వేంకటేశ్, సీ.సంతోష్ కుమార్, వై.రాజేష్ గూడ్, మహ్మద్ అక్రమ్ ఖాన్, ఏ.గౌరిశంకర్, బీ.నిఖిల్, బీ.సాయిరామ్, జే.రాఘవెందర్ రెడ్డి, డీ.సేతు గంగాధర్ రెడ్డి, ఎ.లగన్ సింగ్ ఎంపికయ్యారు.

18 నుంచి 11 స్పోర్ట్స్ 80వ క్యాడెట్
*జాతీయ ఇంటర్ స్టేట్ టీటీ టోర్నీకి తెలంగాణ జట్లు
ఛండీఘడ్‌లో ఈనెల 18 నుంచి 23 వరకు 11 స్పోర్ట్స్ 80వ క్యాడెట్, సబ్ జూనియర్ జాతీయ ఇంటర్ స్టేట్ టెబుల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తారు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే తెలంగాణ బాలబాలికల జట్లను ప్రకటించారు.
తెలంగాణ జట్టుకు ఎంపికైన క్రీడాకారుల పేర్లను తెలంగాణ స్టేట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి పీ.ప్రకాష్ రాజు ప్రకటించారు. జట్టుకు ఎంపికైన వారిలో క్యాడెట్ బాలికల్లో కావ్య, నిఖిత, జే.గౌరి, దర్తి షిరేన్, బాలురలో జతిన్‌దేవ్, పార్త్ బాటీయా, ఏ.మహేష్, తరుణ్ ముఖేష్, సబ్ జూనియర్ బాలికల్లో ఎన్.్భవిత, విధిజైన్, ఇక్షిత, జీ.పాలక్, బాలురలో ఎస్‌ఎస్‌కే.కార్తిక్, కేశవన్ కన్నన్, ప్రణవ్ నల్లారి, అనుప్ కుమారాలున్నారు. జట్టుకు కోచ్‌లుగా ఎం.వేణుగోపాల్, కే.శ్రీ్ధర్, మేనేజర్‌గా ఆనంద్‌రామన్‌లు వ్యవహరిస్తారు.

ఈశ్వరన్ సెంచరీ, బెంగాల్ 336 ఆలౌట్
హైదరాబాద్, డిసెంబర్ 15: నగరంలో జరుగుతున్న రంజీ ట్రోఫి చాంపియన్‌షిప్‌లో భాగంగా హైదరాబాద్‌తో తలపడిన బెంగాల్ మొదటి ఇన్నింగ్స్‌లో 120.3 ఓవర్లలో 336 పరుగులు చేసి ఆలౌటైంది. బెంగాల్ జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన ఏఆర్.ఈశ్వరన్ 17 బౌండరీలు, ఒక సిక్సర్ సహాయంతో 186 పరుగులతో సెంచరీ సాధించడంతో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బెంగాల్ 336 పరుగులు చేసి ఆలౌటైంది. రెండో రోజు శనివారంనాడు బెంగాల్ జట్టు మొదటి రోజు ఆట ముగిసే సరికి 38 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. 99 పరుగుల ఓవర్ నైట్ స్కోరు తేడాతో ఆటను ప్రారంభించిన బెంగాల్ రెండో రోజు ఆటలో ఆటగాళ్లు బ్యాటింగ్‌లో రాణించి 237 పరుగులు జోడించడంతో 336 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. మొదటి రోజు ఆటలో రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఈశ్వరన్ 57 పరుగులు చేసి బ్యాటింగ్‌లో కోనసాగుతున్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి జట్ల శుభారంభం
* అంతర్ జిల్లా సెపక్ తక్ర చాంపియన్‌షిప్
హైదరాబాద్, డిసెంబర్ 15: ఛాదర్‌ఘట్‌లోని విక్టరి ప్లేగ్రౌండ్‌లో శనివారం 5వ సీనియర్ అంతర్ జిల్లా పురుషులు, మహిళాల సెపక్‌తక్ర చాంపియన్‌షిప్ ప్రారంభమైంది. టోర్నమెంట్‌లో జరిగిన మ్యాచ్‌లో పురుషులు, మహిళాల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా జట్లు ప్రత్యర్థులపై విజయం సాధించి శుభారంభం చేసింది. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుల్తాన్‌బజార్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారామిరెడ్డి విచ్చేసి పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సెపక్‌తక్ర సంఘం కార్యదర్శి ఎస్‌ఆర్.ప్రేమ్‌రాజ్ పాల్గొన్నారు.