హైదరాబాద్

‘తెలంగాణ వాగ్గేయ వైభవం’ పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: తెలంగాణ భజన సంకీర్తన ప్రచార పరిషత్ రూపొందించిన ‘తెలంగాణ వాగ్గేయ వైభవం’ పుస్తకావిష్కరణ సభ భక్తి భజన సంకీర్తన, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి డా.కేవీ రమణాచారి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. సర్వ జనులకు అర్థమయ్యే రీతిలో తెలంగాణ వాగ్గేయ వైభవమ్‌ను రూపొందించారని పేర్కొన్నారు. తెలంగాణలో అనేక మంది వాగ్గేయకారులు ఉన్నారని వారిని ప్రొత్సహించాలని సూచించారు. ఐదు రోజుల పాటు వాగ్గేయ వైభవం పేరిట భజన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆచార్య టీ.గౌరీశంకర్ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో పుల్లారెడ్డి సంస్థల అధినేత రాఘవరెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, ఆచార్య డా.బీ.జయ రాములు, సంస్థ అధ్యక్షుడు శివప్రసాద్ పాల్గొన్నారు.
అమృతలతకు సాహితీ పురస్కారం
కాచిగూడ, డిసెంబర్ 16: ప్రముఖ రచయిత్రి డా.అమృతలతకు ‘మాదిరెడ్డి సులోచన - వంశీ సాహితీ’ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం వంశీ ఆర్ట్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి పాల్గొని పురస్కారం ప్రదానం చేశారు. అమృతలత సాహిత్యంలో అన్ని ప్రక్రియాల్లో రచనలు చేశారని పేర్కొన్నారు. నేటి నిజం సంపాదకుడు బైసా దేవదాసు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, రచయిత్రి కిరణ్‌బాల, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, డా.తెనే్నటి సుధాదేవి, సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు.
కుందుర్తి సేవలు మరువలేనివి
కాచిగూడ, డిసెంబర్ 16: ప్రముఖ సాహితీవేత్త కుందుర్తి ఆంజనేయులు సాహిత్య రంగానికి చేసిన సేవలు మరువలేనివని పలువురు వక్తలు అన్నారు. కుందుర్తి ఆంజనేయులు జయంతి సభ శ్రీత్యాగరాయ గానసభ, జీఎస్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి విశ్వ సాహితీ అధ్యక్షుడు జయ రాములు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ దేవసేన, గాయకుడు జీ.శ్రీనివాస్ పాల్గొని కుందుర్తి ఆంజనేయులు చిత్ర పటానికి నివాళి అర్పించారు. ఆంజనేయులు సాహిత్య రంగనికి చేసిన సేవలను కొనియాడారు.
ఆకట్టుకున్న ‘చిత్ర ప్రదర్శన’
కాచిగూడ, డిసెంబర్ 16: ప్రముఖ సినీ దర్శకుడు బాపు జయంతి సందర్భంగా శిఖరం ఆర్ట్స్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘బాపు చిత్రోత్సవం’లో భాగంగా ఆదివారం ‘ముత్యాల ముగ్గు’ చిత్ర ప్రదర్శన ఆదివారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ఆచార్య టీ.గౌరీశంకర్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, వై ఎస్ ఆర్ మూర్తి పాల్గొని బాపు చిత్ర పటానికి నివాళి అర్పించారు. ప్రముఖ సినీ రచయిత, చిత్రకారుడు బ్నిమ్‌కు బాపు పురస్కారం ప్రదానం చేశారు. బాపు దర్శకత్వం వహించిన ‘ముత్యాల ముగ్గు’ చిత్ర ప్రదర్శన ఆకట్టుకుంది.