హైదరాబాద్

ఉల్లం‘ఘను’లపై కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో స్వచ్ఛత, పరిశుభ్రతను పెంపొందించటంలో భాగంగా నాలాలు, చెరువుల్లో ప్లాస్టిక్, చెత్త వ్యర్థాలు వేయరాదన్న నిబంధనను ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ మరోసారి ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం ఆస్తిపన్ను వసూళ్లు, స్వచ్ఛ సర్వేక్షణ్ వంటి అంశాలపై జోనల్ కమిషనర్లు, ఇంజనీర్లతో ఆయన ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలో ప్రస్తుతమున్న పబ్లిక్ టాయిలెట్లను మరింత పరిశుభ్రంగా నిర్వహించటంతో పాటు గతంలో గుర్తించిన బహిరంగ మూత్ర విసర్జన ప్రాంతాలు, చెరువుల వద్ద ప్రత్యేకంగా తాత్కాలిక టాయిలెట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరంలో బహిరంగ మూత్ర విసర్జన చేయటం, భవన నిర్మాణ వ్యర్థాలను వేయటం, నాలాలు, చెరువుల్లో ప్లాస్టిక్‌ను, చెత్తను వేయటం, రోడ్లపై చెత్తను వేసే వారిపై మరింత కఠినంగా వ్యవహారిస్తూ, జరిమానాలు విధించాలని ఆదేశించారు. ఇందుకోసం విజిలెన్స్ అధికారులతో ప్రత్యేకంగా లేక్ ప్రొటెక్షన్ టీంలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించేందుకు వీలుగా ఇప్పటికే 2500 స్వచ్ఛ ఆటోలను అందుబాటులో ఉంచామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, రోడ్లపై, నాలాల్లో, చెరువుల్లో చెత్తను వేయరాదని సూచించారు. నేటికీ కొందరు నగరపౌరుల బాధ్యతారహిత్యం కారణంగా నగర సుందీరకరణకు భంగం కలుగుతోందని వాపోయారు. వచ్చే నెలలో నగరంలో నిర్వహించనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2019కి సంబంధించి సర్వేక్షణ్‌కు స్వచ్ఛ్భారత్ మిషన్ నిర్దారించిన ఏడు ప్రశ్నల పట్ల నగరవాసుల్లో పూర్తి స్తాయిలో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గాను నగరంలోని మూడు వేల పై చిలుకు ఉన్న కాలనీ సంక్షేమ సంఘాల, బస్తీ కమిటీలు, స్వయం సహాయక బృందాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, స్వచ్ఛ సర్వేక్షణ్‌పై చైతన్యపర్చనున్నట్లు తెలిపారు.
స్వచ్ఛ ఆటోలకు జీపీఎస్
నగరంలోని ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి, త్వరితగతిన చెత్తను నగరం నుంచి తరలించేందుకు ఇప్పటికే అందుబాటులో ఉన్న 2500 స్వచ్ఛ ఆటోల రాకపోకల్లో పారదర్శకతను పెంపొందించేందుకు జీపీఎస్ విధానాన్ని అనుసంధానం చేయనున్నట్లు కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. ఇప్పటికే వివిధ దశల్లో ఉన్న ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలో వంద కిలోలకు పైగా వ్యర్థాలను ఉత్పత్తి చేసే హోటళ్లన్నింటిలో కంపోస్టు యూనిట్లు ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు గాను జొనల్ కమిషనర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. దీనికి తోడు ప్రతి వ్యాపార సంస్థ, దుకాణాల ముందు తప్పకుండా డస్ట్‌బిన్లను, మెయిన్‌రోడ్లకిరువైపులా కూడా వీటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

జలమండలి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు

హైదరాబాద్, డిసెంబర్ 17: జంటనగరాల దాహర్తిని తీర్చే జలమండలి ఆధ్వర్యంలో సోమవారం ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా పలు వేషధారణలు ఆహూతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. యేసు క్రీస్తు జననాన్ని వివరిస్తూ ప్రదర్శితమైన నాటక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, సెకండరీ ట్రాన్స్‌మిషన్ డైరెక్టర్ డా.పీఎస్ సూర్యనారాయణ, ఫైనాన్స్ డైరెక్టర్ వాసుదేవ నాయుడు, రెవెన్యూ డైరెక్టర్ బీ. విజయ్‌కుమార్ రెడ్డి, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి.రవి, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ హైదరాబాద్ సెంటర్ చైర్మన్ ఆర్. రామేశ్వరరావు, జలమండలి ఉద్యోగులు పాల్గొన్నారు.