హైదరాబాద్

వాతావరణ మార్పులతో ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో వాతావరణంలో చోటు చేసుకుంటున్న పెనుమార్పులతో ప్రజలకు రోగాల భయం పట్టుకుంది. పెథాయ్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోవటం, పలుచోట్ల చిరుజల్లులు కురవటం, మరికొన్ని చోట్ల చల్లటిగాలులు వీయటం, గాలిలో తేమ ఎక్కువ కావటంతో ఇప్పటికే చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు వంటి స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. నవంబర్ ప్రారంభం మొదటి నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు అంటువ్యాధులు ప్రబలే అవకాశముందని ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, జిల్లా వైద్యారోగ్యశాఖ గతంలోనే ప్రకటించినా, ఇపుడు వాతావరణంలో విచిత్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నా, నగరంలో కనీస వ్యాధి నివారణ చర్యలు చేపట్టకపోవటం గమనార్హం. చలి నుంచి ఉపశమనం పొందేందుకు నగరవాసులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తప్పని పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకొస్తున్న వారు స్వెట్టర్లు, హెల్మెట్లను ధరిస్తున్నారు. ఈ క్రమంలో స్వెట్టర్లకు ఆదరణ పెరిగింది. నగరంలో స్వెట్టర్లు విక్రయించే ఓల్డ్ గాంధీ ఆసుపత్రి, అమీర్‌పేట, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో గడిచిన రెండురోజులుగా కొనుగోలు దారుల సందడి నెలకొంది. ఇదిలా ఉండగా, నల్లకుంట ఫీవర్ ఆసుప్రతి, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతో పాటు నాంపల్లి ఇతరత్ర ఏరియా ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో రోజుకి వెయ్యి మంది ఔట్ పేషెంట్లు వస్తుండగా, ఈ సీజనల్‌లో రోజుకి అదనంగా మరో నాలుగు నుంచి ఐదు వందల మంది రోగులు రావటంతో ఆసుపత్రి కిటకిటలాడుతోంది. చాలా మంది స్వల్ప అనారోగ్యాలతో బాధపడుతూ చిన్న చిన్న క్లినిక్‌లను ఆశ్రయిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ వ్యాధి అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న కొన్ని బస్తీలు, మురికివాడలకు చెందిన ప్రజలకు వ్యాధులపై అవగాహన లేక చిన్న చిన్న క్లినిక్‌లలోనే చికిత్స చేయించుకుంటున్నారు. ఈ రకమైన కేసుల్లోనే వ్యాధి తీవ్ర పెరిగి, వారికి స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులు నిర్ధారణై, పరిస్థితి ముంచుకొచ్చి, ప్రాణాలకే ముప్పు ఏర్పడిన సందర్భాలున్నాయి.
తుఫాన్ కారణంగా నగరంలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న చలి ప్రభావం కారణంగా ఉదయానే్న స్కూళ్లకు వెళ్లాల్సిన విద్యార్థులు యూనిఫారంపై స్వెట్టర్లు ధరించి వెళ్తున్నారు. కానీ కొన్ని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు స్వెట్టర్లు ధరించిన విద్యార్థులను లోనికి అనుమతించకపోవటం, కొద్దిసేపు బయటే నిల్చుండబెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు పలువురు విద్యార్థులు వాపోతున్నారు.