హైదరాబాద్

బీసీలను మోసం చేసే కుట్రలను సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరి రామకృష్ణయ్య మాట్లాడారు. బీసీలకు రాజకీయ అధికారం రాకుండా అడ్డుకునే కుట్రలకు టీఆర్‌ఎస్ తెరలేపిందని మండిపడ్డారు. కుట్ర పూరితంగా బీసీలకు రిజర్వేషన్ల అందకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యుహాత్మకంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. బీసీలను కులవృత్తులకే పరిమితం చేసి రాజకీయంగా అగణదొక్కాలనే దీర్ఘకాలిక కుట్ర ఇందులో దాగి ఉందని విమర్శించారు. ఆ పార్టీకి చెందిన సర్పంచులచే కేసులు వేయించి సరిగా వాదించకుండా ప్రభుత్వం ఓడినట్టు ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు కేవలం సాకు మాత్రమేనని, జనాభా లెక్కలు ఎందుకు తేల్చడం లేదని నిలదీశారు. బీసీ ఓట్లతో నెగ్గిన ముఖ్యమంత్రి బీసీల పట్ల వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. వీటన్నింటికికీ పార్లమెంట్ ఎన్నికల్లో తగ్గిన మూల్యం చెల్లుంచుకోక తప్పదని హెచ్చరించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లపై బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. సమావేశంలో నరేష్, సైదులు, నర్సింహ, శ్రీను, అనిల్, నిరంజన్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.