హైదరాబాద్

కొత్త ఓటర్ల నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున వచ్చే నెల 1వ తేదీ నుంచి మళ్లీ ఓటరు జాబితా సవరణ చేపట్టనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. ఈ ప్రక్రియ విజయవంతమయ్యేందుకు వీలుగా అన్ని రాజకీయపార్టీలకు చెందిన ప్రతినిధులు ఎన్నికల సిబ్బందితో సమన్వయంగా వ్యవహరిస్తూ సహకరించాలని ఆయన సూచించారు. మంగళవారం కమిషనర్ వివిధ రాజకీయ పార్టీల నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతులు వచ్చిన తర్వాత రాజకీయపార్టీలు కూడా సూచనలు, సలహాలు ఇవ్వవచ్చునని వివరించారు. ఈ ప్రక్రియకు సంబంధించి బూత్ లెవెల్ అధికారులతో పాటు ప్రతి మూడు, నాలుగు పోలింగ్ స్టేషన్లకు ఓ ఆపరేటర్‌ను నియమించనున్నట్లు తెలిపారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించి ఇప్పటికే నియమితులైన బూత్ లెవెల్ అధికారులను ప్రక్రియలో జరిగే లోపాలకు బాధ్యులను చేసి, వారిపై కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని కొన్ని రాజకీయపార్టీల నేతలు కమిషనర్‌ను కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంతో మంది ఓట్లు గల్లంతయ్యాయని, మరికొందరు తమకు సంబంధించి ప్రాంతాల్లో తమ ఓట్లను వేసిన విషయాన్ని వివరించారు. ఇతర ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకో లేకపోయినట్లు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని ఏ ఒక్క ఓటు గల్లంతు కాకుండా, తొలగించకుండా చక్కటి ఓటరు జాబితాను రూపొందించాలని నేతలు కోరారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలను కూడా భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 26 నుంచి కొత్త ఓటర్ల వివరాలను నమోదు చేసేందుకు బీఎల్‌ఓలకు సహాయంగా వాలంటీర్లను నియమించనున్నట్లు తెలిపారు. 1వ తేదీ నాటికి 18 ఏళ్ల వయస్సు పూర్తి చేసుకునే వారు కొత్త ఓటర్లుగా తమ వివరాలను ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఓటు గల్లంతైన వారు సంబంధిత ఓటరు నమోదు అధికారిని సంప్రదించి, అవసరమైన ఫారం 6,7,8ల కింద మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ రకంగా అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేసుకుని ఫిబ్రవరి 11న ఓటరు జాబితా ముసాయిదాను, ఫిబ్రవరి 22న తుది జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 26వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సయ్యద్ అమిన్ జాఫ్రీ, ఎమ్మెల్యే టీ. రాజాసింగ్‌తో పాటు వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.