హైదరాబాద్

ఆలస్యంగా వస్తే జరిమానాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: నగరంలో ప్రతిరోజు పోగవుతున్న చెత్తను వీలైనంత త్వరగా డంపింగ్ యార్డుకు తరలించాలన్న ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ఇంటింటి పంపిణీ చేసిన డస్ట్‌బిన్ల ద్వారా తడి, పొడి చెత్తపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని, దీంతో పాటు ప్రతి పారిశుద్ధ్య కార్మికుడు తప్పక సమయానికి విధులకు హాజరుకావాలని, ఆలస్యంగా వచ్చే వారికి జరిమానాలు విధించాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం పారిశుద్ధ్యం పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో దాదాపు 70 శాతానికి పైగా ప్రజలకు డస్ట్‌బిన్లను పంపణీ చేసినప్పటికీ వాటిలో తడి, పొడి చెత్త వేర్వేరుగా వేయటం జరగటం లేదని కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలో ఆటో టిప్పర్లను ప్రవేశపెట్టడంతో పాటు వాటికి కాలనీలు, ఇళ్లు కేటాయింపు పూర్తియినందున తడి,పొడి చెత్త వేర్వేరుగా సేకరించే అంశంపై దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి శానిటేషన్ ఫీల్డు అసిస్టెంటు తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ఈ విషయంలో ప్రత్యేక అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ సర్కిల్‌లోనైనా డస్ట్‌బిన్లు పంపిణీ పూర్తి కాని పక్షంలో రానున్న మరో మూడురోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి డిప్యూటీ కమిషనర్, మెడికల్ ఆఫీసర్లు, పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రతిరోజు తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని పేర్కొన్నారు. తరుచూ ఉద్దేశపూర్వకంగా విధులకు గైర్హాజరయ్యే పారిశుద్ధ్య కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి కార్మికుడు తగిన సమయానికి విధులకు హాజరయ్యేలా చూడాలన్నారు. అలాగే వారి ఆరోగ్యపరిరక్షణ కోసం వైద్య చికిత్సలను కూడా నిర్వహించాలని సూచించారు. ప్రతి డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్లు తమ పరిధిలోని వాహనాలు, డంపర్ బిన్లు, రిక్షాలు అదనంగా ఉంచాలని ఊచించారు. ప్రస్తుతమున్న వాహనాలు తరుచూ మరమ్మతులకు గురవుతున్నందున పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు ఆటంకం లేకండా ఈ అదనపు వాహభాలను వినియోగించాలన్నారు. ఈ సమావేశంలో పలువురు అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.