హైదరాబాద్

డబుల్ ఇళ్లపై గడబిడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : అమాయక పేదల ప్రజలను నమ్మించి మోసం చేస్తారా? డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని ఉన్న ఇళ్లను కూల్చివేశారు. ఇపుడేమో ఏడాదిన్నర నుంచి అద్దె ఇళ్లలో ఉంటూ కిరాయిలు కట్టలేక చస్తున్నాం..కమిషనర్ డౌన్ డౌన్..మా ఇళ్లు కట్టివ్వాలి అన్న నినాదాలతో శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రదాన కార్యాలయం దద్దరిల్లింది. గుడిమల్కాపూర్ డివిజన్‌లోని భోజగుట్టలో నివసించిన 1824 ఇళ్ల యజమానులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టిస్తామన్న జీహెచ్‌ఎంసీ అధికారులు అక్కడ కేవలం 245 ఇళ్లను మాత్రమే నిర్మిస్తుండటం, కాంట్రాక్టు గడువు ముగుస్తుండటంతో లబ్దిదారులు శుక్రవారం జీహెచ్‌ఎంసీ ఆఫీసు ముందు ధర్నా చేపట్టారు.
తొలుత వారంతా ప్లకార్డులు పట్టుకుని మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోనికి వస్తుండగా సెక్యూరిటీ వారిని అడ్డుకోవటంతో వారు మెయిన్ రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వం, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత ఎంట్రెన్స్ గేటును తోసుకుని, లోనికి చొరబడి కమిషనర్ ఎంట్రెన్స్ ముందు బైఠాయించి, సుమారు రెండు గంటల పాటు నిరంతరంగా నినిదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. వారికి లోనికి చొచ్చుకోచ్చేటపుడు ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెంటనే సైఫాబాద్ పోలీసులు రంగప్రవేశం చేసి, వారిని అదుపు చేశారు. గంటన్నర సేపు కమిషనర్ బయటకు రావాలి..! అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ధర్నా చేసినానంతరం పోలీసు అధికారులు వారితో మాట్లాడి అధికారులతో మాట్లాడేందుకు లోనికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కమిషనర్ అందుబాటులో లేరని, ఆయనతో చర్చించి మీకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని చీఫ్ ఇంజనీర్ సురేశ్ చెప్పటంతో భోజగుట్ట వాసులు తిరిగి వెళ్లిపోయారు.
ఇంకెన్నాళ్లు..?
లబ్దిదారుల సంఖ్య 1824 ఉంటే, జీహెచ్‌ఎంసీ నిర్మిస్తున్న ఇళ్లు కేవలం 245 మాత్రమే ఉన్నాయని, గడువు ముగియటంతో కాంట్రాక్టరు వెళ్లిపోతే, మిగిలిన లబ్దిదారుల పరిస్థితి ఏమిటీ? అని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ అధికారుల మాటలు నమ్మి ఇళ్లు ఖాళీ చేసిన తాము ఈ విషయం ఇప్పటి వరకు స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినా, వారు పట్టించుకోకపోవటంతో ఇక్కడ ధర్నా చేస్తున్నట్లు తెలిపారు.
సంక్రాంతి పండుగకు జాగ్రత్త
నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సూచన

హైదరాబాద్, జనవరి 11: సంక్రాంతి పండుగ వేడుకలను శాంతి సమరస్యంతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు.
పండుగ సంబురాల్లో భాగంగా గాలి పటాలు ఎగురవేయడంలో తగిన జాగ్రత్తలు పాటించడం, చిన్నారుల పట్ల పెద్దలు కూడా అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. రోడ్లు, ప్రధానదారులు, ప్రార్థన మందిరాల పరిసరాల్లో గాలిపటాలు ఎగురవేయరాదని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనలు ఈనెల 14వ తేదీ సాయంత్రం నుంచి 16వ తేదీ తెల్లవారుఝాము వరకు అమల్లో ఉంటాయని అంజనీ కుమార్ తెలిపారు. ప్రధానంగా చిన్నారుల పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.