హైదరాబాద్

స్వస్థలాలకు తరలుతున్న నగరవాసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : సంక్రాంతి పర్వదినం సమీపిస్తుండటం, శనివారం నుంచి వరుసగా సెలవులు రావటంతో మహానగరవాసులు పండుగను తమ స్వస్థలాల్లో జరుపుకునేందుకు తరలుతున్నారు. నగరంలో స్థిరపడ్డ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారు కొద్దిరోజులుగా తమ స్వస్థలాలకు పయనమవుతుండటంతో నగరంలోని బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతికి హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు లక్షలాది మంది ప్రయాణిస్తున్నందున ఈసారి కూడా టీఎస్‌ఆర్టీసీ, ఏపీఆర్టీసీతో పాటు దక్షిణ మధ్య రైల్వే అదనంగా బస్సులు, రైళ్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఏపీలోని వివిధ జిల్లాల్లోని ప్రాంతాలకు చెందిన నగరవాసుల్లో ముందుగా బస్సు, రైలు టికెట్లను రిజర్వేషన్లు చేసుకున్నవారు మినహా అప్పటికపుడు ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్న వారికి ఇబ్బందులు తప్పటం లేదు. సికిందరాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లతో పాటు ఇమ్లిబన్, జూబ్లీబస్ స్టేషన్లు ప్రయాణికులతో నిండి కన్పిస్తోంది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు వెళ్లే రైళ్లు, బస్సుల మాట అలా ఉంచితే ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ప్రయాణికులు నిలబడి ప్రయాణం కొనసాగించాల్సి వస్తోంది. ముందస్తు ప్రణాళికలు లేకుండా అప్పటికపుడే ప్రయాణాలు నిర్ణయించుకున్న వారికి రైలు, బస్సు టికెట్లు లభించకపోవటంతో ప్రత్యామ్నాయంగా ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వీరిలో కాస్త ఆర్థిక స్తోమత కల్గినవారు ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇప్పటికే పది రేట్లు పెరిగిన విమానాల్లో ప్రయాణిస్తున్నారు. తెలంగాణ, ఏపీల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడ్డ వారు తమ స్వస్థలాలకు తరలివెళ్లటంతో నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్లపై వాహన రాకపోకలు కాస్త పలుచబడ్డాయి. హైటెక్‌సిటీ, అమీర్‌పేట, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రాంతాల్లో కొన్ని వ్యాపార సంస్థల నిర్వాహకులు, సిబ్బంది కూడా తమ స్వస్థలాలకు వెళ్లటంతో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకే మూతపడ్డాయి. రెండో శనివారం మొదలుకుని, ఆది, సోమ, మంగళవారం వరకు సెలవులు రావటంతో గ్రామాల్లో ఎంజాయ్ చేసేందుకు వెళ్లేవారిలో యువత ఎక్కువగా ఉండటం విశేషం.