హైదరాబాద్

18న అమరజ్యోతి ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 23వ వర్ధంతిని పురస్కరించుకుని ఈనెల 18వ తేదీన నగరంలో రసూల్‌పురా చౌరస్తా నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్ తనయుడు శ్రీపతి సతీష్ ఆధ్వర్యంలో అమరజ్యోతి ర్యాలీని నిర్వహించనున్నట్లు టీడీపీ నగర అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ రావు వెల్లడించారు. శుక్రవారం సిటీ టీడీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమానికి సినీ నటుడు బాలకృష్ణ హాజరవుతున్నారని, పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నగరంలోని అన్ని మున్సిపల్ డివిజన్లలో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా అమరజ్యోతి ర్యాలీలను నిర్వహించి, ప్రజలకు అవసరమయ్యే సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో అన్నదాన కార్యక్రమాలు, పండ్ల పంపిణీ, శ్రద్ధాంజలి ఘటించటం వంటి కార్యక్రమాలను నిర్వహించాలని సూచించినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాకూటమి పరాజయంపై కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్, టీడీపీ మధ్య పొత్తు అనేది రెండు పార్టీల జాతీయ నాయకత్వాలతో కుదిరిందనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. కాంగ్రెస్ అపజయాల గురించి మాట్లాడుతూ, ఆ పార్టీలో ఏమైనా భేధాభిప్రాయాలుంటే పార్టీ అంతర్గతంగా చర్చించుకోవాలే గానీ, టీడీపీతో నష్టం జరిగిందని నేతలు మాట్లాడటం సబబు కాదని సూచించారు. టీడీపీ పార్టీని చులకన చేస్తూ మాట్లాడటం మానుకోవాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. సమావేశంలో టీడీపీ నేతలు వనం రమేశ్, కూన వెంకటేశ్ గౌడ్, నల్లెల కిషోర్ బాబు పాల్గొన్నారు.
అంకెల గారడీ బల్దియా బడ్జెట్
రానున్న ఆర్థిక సంవత్సరానికి బల్దియా రూపొందించిన బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీ అని ఎంఎన్ శ్రీనివాస్ రావు వ్యాఖ్యానించారు. గతంలో ప్రభుత్వం చెప్పిన ఏ అభివృద్ధి, సంక్షేమ కర్యాక్రమాలు పూర్తి చేయలేదని, డబుల్ బెడ్ రూం ఇళ్ల పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్‌లో రూ.7076 కోట్లు ఆశించగా, కేవలం రూ.1200 కోట్లు మాత్రమే సమకూర్చారని, రానున్న ఆర్థిక సంవత్సరానికి కూడా ఎక్కువ మొత్తంలో ఆశిస్తున్నా, సమకూర్చుకునే మార్గాల్లేవని, ఇప్పటికే కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.