హైదరాబాద్

రాష్ట్ర ఆదాయాన్ని బట్టే పథకాలను అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: రాష్ట్ర ఆదాయన్ని దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం పథకాలను అమలు చేయాలని తెలంగాణ ఎల్డర్స్ ఫోరం విజ్ఞప్తి చేసింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఫోరం కన్వీనర్ వావిలాల భూపతి రెడ్డి మాట్లాడారు. ఆదాయానికి మించిన పథకాలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసే ప్రమాదం ఉందని అన్నారు. రైతుబంధు పథకానికి పరిమితులు విధించాలని కోరారు. వర్షకాలంలో ఐదు ఎకరాలకు, ఎండ కాలంలో 2-3 ఎకరాలకు దీనిని వర్తింప చేయడంతో పాటు సాగుచేయని భూములను ఇందులో నుంచి మినహాయించాలని కోరారు. రైతుబంధు అందిస్తున్నందున రుణ మాఫీకి ప్రాధాన్యం ఇవ్వకుండా పండించిన పంటకు మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని, పంటలను భద్రపరుచుకునేందుకు శీతల గిడ్డంగుల ఏర్పాటుపై దృష్టి సారించాలని కోరారు. వికలాంగులకు అందిస్తున్న పింఛన్లను 59 సంవత్సరాల వరకు రెండు వేల రూపాయలు, 60 ఏళ్లు పైబడ్డవారికి మూడు వేలను అందించేందుకు పరిశీలించాలి. వృద్ధాప్య పింఛన్లను 60 ఏళ్లు పైబడ్డ వారికి వెయ్యి, 70 ఏళ్లు పైబడ్డ వారికి రెండు వేల రూపాయలు పరిమితం చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున నిరుద్యోగ భృతి అందించడం సరికాదని అన్నారు. చదువుకున్న నిరుద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేని సమయంలో స్వయం ఉపాధి మార్గాలను అనే్వషించాలని, అందుకు వారిని ప్రోత్సహించాలని కోరారు.
నిరుద్యోగ భృతి కల్పించాల్సి వస్తే రూ.2లక్షల్లోపు కుటుంబ ఆదాయం కలిగిన వారికి అందించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులను ఖచ్చితంగా గుర్తించి అత్యధికులకు అందేలా మార్పులు చేయాలని సూచించారు. కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలు సైతం సరికావని, వీటివల్ల వివాహ సమయంలో పెట్టే ఖర్చు పెరుగడంతో పాటు 18 ఏళ్లు పడగానే పెళ్లిల్లు జరుగుతున్నాయని అన్నారు.
దీనిని మార్పుచేసి వివాహ సమయంలో రూ.50 వేలు అందించి, మిగిలిన మొత్తాన్ని ఫిక్సిడ్ డిపాజిట్ రూపంలో అందించాలని కోరారు. అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసాన్ని తగ్గించి, పర్యావరణ అనుకూల పరిశ్రమలను గ్రామ, మండల స్థాయిల్లో స్థాపించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా భవిష్యత్ తరాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ విద్యాసంస్థలకు, విశ్వవిద్యాలయాలకు తగినంత నిధులు కేటాయించడంతో పాటు నేటి తరానికి తగ్గట్టుగా కోర్సులను ప్రవేశపెట్టాలని కోరారు. ప్రైవేట్ ఆసుపత్రులు, విద్యా సంస్థలు వసూళ్లపై నియంత్రణ విధించి సాధారణ ప్రజలకు న్యాయం జరిగేలా చేపట్టాలని కోరారు. బతుకమ్మ చీరలు, ఇతర పండుగల సమయంలో అందించేందుకు చేపట్టిన చిన్న పథకాలవల్ల ప్రభుత్వంపై వేల కోట్లు భారం పడుతోందని, వీటిని కుదించి భవిష్యత్ తరాలకు మేలు చేసేలా నిధులను ఖర్చు చేస్తే బావుటుందని సూచించారు.
తమ విజ్ఞప్తులను ముఖ్యమంత్రి కార్యాలయానికి సైతం పంపించినట్టు చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన తామంతా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి ఈ సూచనలు చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో రాజమల్లయ్య, లక్ష్మినారాయణ, మధుసూదన్, రాజేశం, మల్లారెడ్డి పాల్గొన్నారు.

టెన్నిస్ టోర్నమెంట్
హైదరాబాద్, జనవరి 16: హైదరాబాద్ జిల్లా టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో వార్షిక అంతర్ క్లబ్ టెన్నిస్ టోర్నమెంట్ పిబ్రవరి 30 తేదీన అజీజ్‌నగర్‌లోని లేక్ వ్యూ టెన్నిస్ అకాడమీలో నిర్వహిస్తారు. ప్లస్ 35, 45, 55 డబుల్స్‌లో పోటీలు జరుగుతాయి. టోర్నీలో పాల్గొనదలిచిన అసక్తి కల వారు తమ పేర్లను ఈనెల 30వ తేదీలోపు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. టోర్నీలో పాల్గొనదలిచిన అసక్తి గల వారు వివరాలకు ప్రవీణ్ భార్గవను ఫోన్ నెంబర్ 9440422920లో సంప్రదించాల్సి ఉంటుంది.
20 నుంచి రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నీ
హైదరాబాద్, జనవరి 16: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ ఈనెల 20వ తేదీన నిర్వహిస్తారు. పోటీలు బాలబాలికల అండర్-15, 13, 11, 9, 7 విభాగంలో జరుగుతాయి. పోటీలో పాల్గొనదలిచిన ఆసక్తిగలవారు వివరాలకు తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం కార్యదర్శి కేఎస్.ప్రసాద్‌ను సెల్ ఫోన్ నెంబర్ 7337399299లో సంప్రదించాలి.