హైదరాబాద్

నేటి నుంచి ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నందున నగరంలో పలు ఆంక్షలను అమలు చేయనున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్ సిటీ పోలీసు యాక్టు1348లోని సెక్షన్ 22(1)(ఏ) నుంచి (ఎఫ్)వరకు, 22(2)(ఏ),(బీ) ప్రకారం శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, సభలు, సమావేశాలను నిషేధిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ చుట్టూ నాలుగు కిలోమీటర్ల వరకు పోలీసు ఆంక్షలు అమల్లో ఉంటాయని కమిషనర్ తెలిపారు. ఈ ఉత్తర్వులు 17వ తేదీ గురువారం ఉదయం ఆరు గంటల నుంచి ఈనెల 21వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అమల్లో ఉంటాయని, ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని కూడా కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు.