హైదరాబాద్

ఆస్తిపన్ను పెంచే యోచన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆస్తిపన్ను పెంచే యోచన లేదని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ స్పష్టం చేశారు. ఆస్తుపన్ను పెంచుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మరాదని సూచించారు. బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఇప్పట్లో ఆస్తిపన్ను పెంచే ప్రసక్తేలేదని వెల్లడించారు. కానీ జీహెచ్‌ఎంసీకి ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను మరింత పటిష్టంగా, ముమ్మరం వసూలు చేయనున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని భవనాలకు జీఐఎస్ మ్యాపింగ్ చేస్తామని తెలిపారు. ఈ విధానంతో ఇప్పటి వరకు ఆస్తిపన్ను చెల్లింపు పరిధిలో లేని భవనాలను గుర్తించి, ఆస్తిపన్ను మదింపును చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో కొనసాగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 సర్వేలో నగరాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు పలు స్వచ్ఛ కార్యక్రమాలను చేపట్టామని, ఇందులో ప్రజలు కూడా భాగస్వాములైన నగరానికి మెరుగైన ర్యాంకు వచ్చేందుకు సహకరించాలని సూచించారు. ఇప్పటికే నాలాల్లోని పూడికతీత పనులు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు.
నగరాన్ని మరింత శుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు నగరంలో వంద కిలోల పైచిలుకు చెత్తను ఉత్పత్తి చేస్తున్న కమర్షియల్ ప్రాంతాల్లో ప్రతి వంద మీటర్లకు ఓ డస్ట్‌బిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టామని వివరించారు. దీంతో పాటు వంద కిలోల పైచిలుకు చెత్తను ఉత్పత్తి చేసే హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థలన్నీ కూడా తప్పకుండా కంపోస్టు యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టామని, ఇప్పటి వరకు యూనిట్లను ఏర్పాటు చేయని సంస్థలను గుర్తించి జరిమానాలు విధించటం, సీజ్ చేయటం వంటి చర్యలను ముమ్మరం చేశామని తెలిపారు. స్వచ్ఛ కార్యక్రమాలను కేవలం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే వరకే పరిమితం చేయకుండా మరో ఆరు నెలల పాటు విస్తృత స్థాయిలో నిర్వహించాలని, ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. చెంగిచెర్ల ఆధునిక స్లాటర్ హౌజ్‌కు మరో 150 మీటర్ల పైప్‌లైన్ వేయనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.
‘సాఫ్ హైదరాబాద్ - షాందార్ హైదరాబాద్’
నగరంలో ‘స్వచ్ఛ’ కార్యక్రమాలను ప్రస్తుతం జరుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే సమయానికే పరిమితం చేయకుండా మరో ఆరు నెలల పాటు కొనసాగించేందుకు వీలుగా ‘సాఫ్ హైదరాబాద్ - షాందార్ హైదరాబాద్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. ప్రత్యేకంగా వాహనాలకు కెమెరాలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా రహదారుల్లో చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలన్న ప్రాంతాలను గుర్తించి, కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షించి, వాటి తరలింపునకు తగిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
బాండ్ల ద్వారా మూడో విడత నిధుల సేకరణ
నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ పనులు, లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల నిధుల కోసం జీహెచ్‌ఎంసీ మూడోసారి బాండ్ల సేకరణ ద్వారా నిధులను సమకూర్చకునేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి ముంబై స్టాక్ ఎక్స్చేంజికి వెళ్లనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఇప్పటికే రూ. 300 కోట్ల విలువైన నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.