హైదరాబాద్

సంక్రాంతి జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో ఈసారి సంక్రాంతి పండుగ జోష్ మరింత పెరిగింది. సంక్రాంతి పండుగను నగరవాసులు పతంగ్‌లను ఎగరవేస్తూ, కేరింతలు కొడుతూ ఘనంగా జరుపుకోవటం ఆనవాయితీ. పక్షులకు, మనుషులకు ప్రమాదకరంగా మారిన చైనా మాంజాపై ఇప్పటికే నిషేధం ఉన్నా, ఈసారి కూడా అది ఎక్కడా అమలు కాలేదు. సోమ, మంగళవారాలతో పాటు బుధవారం కూడా పలు ప్రాంతాల్లో పతంగ్‌లు, మాంజా, చైనా మాంజాల అమ్మకాలు జోరుగా సాగాయి. పతంగ్‌లు, ధారం, మాంజాల రేట్లు గత సంవత్సరం మాదిరిగానే అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా ఉండటమే రెండురోజుల పాటు పతంగ్‌లను జోరుగా ఎగురవేయటానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో చైనా మాంజా విక్రయాలు బహిరంగంగానే కొనసాగాయి. దూల్‌పేట, బేగంబజార్, మంగల్‌హాట్, మల్లేపల్లి, ఖైరతాబాద్, చింతల్‌బస్తీ, కోఠి, గౌలీగూడ తదితరు ప్రాంతాల్లో బుధవారం కూడా పతంగ్‌ల దుకాణాల వద్ద కొనుగోలుదారుల సందడి కన్పించింది. మంగళ, బుధవారాలు రెండురోజుల్లో నగరవాసులు పతంగ్‌లను ఎగురవేసి ఎంజాయ్ చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి నగరవాసుల్లో సంక్రాంతి జోష్ పెరిగింది. పాతబస్తీతో పాటు న్యూ సిటీలోని వివిధ ప్రాంతాల్లో యువకులు, చిన్నారులు భవనాలపై పాటలు పెట్టుకుని, మైక్ ద్వారా ఆనౌన్స్ చేస్తూ పతంగ్‌లను ఎగురవేశారు. దూల్‌పేట, మల్లేపల్లి, అహ్మద్‌నగర్, బేగంబజార్, పాతబస్తీలోని చార్మినార్, లాల్‌దర్వాజ, హుస్సేనీ ఆలం, పురానాపూల్‌తో పాటు నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో యువకులు ఎక్కువగా పతంగ్‌లను ఎగరేశారు. విభేధాలకు తావులేకుండా మరో వర్గానికి చెందిన యువకులు సైతం పతంగ్‌లను ఎగురవేసి ఎంజాయ్ చేశారు. సంక్రాంతి పండుగను తమ స్వస్థలాల్లో జరుపుకునేందుకు వెళ్లిన నగరవాసులు తిరుగు ప్రయాణమయ్యారు. తెలంగాణలోని వివిధ జిల్లాలకు వెళ్లిన నగరవాసుల్లో చాలా మంది బుధవారం సాయంత్రం నగరానికి చేరుకోగా, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన నగరవాసులు గురు, శుక్రవారాల్లో నగరానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.