హైదరాబాద్

భావితరాలకు ఇనాక్ రచనలు స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ రచనలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా నియమితులైన ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు సన్మాన సభ శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో గురువారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోశయ్య విచ్చేసి ఇనాక్‌ను ఘనంగా సన్మానించారు. భవిష్యత్‌లో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాక్షించారు. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీ్ధర్ మాట్లాడుతూ ఇనాక్ జీవిత చరిత్ర భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అన్ని ప్రక్రియాల్లో తన రచనలు చేశారని పేర్కొన్నారు. ఇనాక్ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అకాక్షించారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం సభాధ్యక్షత వహించగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా.నందిని సిధారెడ్డి, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, ఆచార్య సూర్య ధనంజయ పాల్గొన్నారు.
ఎన్‌టీఆర్ సినీ సంగీత విభావరి
కాచిగూడ, జనవరి 17: నందమూరి తారక రామారావు 23వ వర్దంతి సందర్భంగా స్వరమాధురి సాంస్కృతిక సేవా సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఎన్‌టీఆర్’ చిత్ర గీతాల సినీ సంగీత విభావరి గురువారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి వైఎస్‌ఆర్ మూర్తి, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ రిటైర్డ్ ఏసీపీ రవిమన్యు పాల్గొని ఎన్‌టీఆర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఎన్‌టీఆర్ వర్దంతి సందర్భంగా మూడు రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ గాయనీ సాయిపావని నిర్వహణలో గాయనీ, గాయకులు తాడూరి అంజి, రేణుక, శారద, చంద్రజ్యోతి అలపించిన సినీ గీతాలు అలరించాయి.

‘మాధవ మందారాలు’ పుస్తకావిష్కరణ
కాచిగూడ, జనవరి 17: ప్రముఖ రచయిత కోరుప్రోలు మాధవరావు రచించిన ‘మాధవ మందారాలు-2’ పుస్తకావిష్కరణ సభ తేజ ఆర్ట్ క్రియేషన్ ఆధ్వర్యంలో గురువారం రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. కోరుప్రోలు మాధవరావు సూమారుగా మూడువేల గజల్‌ను తెలుగజాతికి అందించడం అభినందనీయమని అన్నారు. సాహితీ ప్రక్రియను నిత్య విద్యార్థీలా సాధన చేస్తున్నారని తెలిపారు. సాహిత్యంలో నవరసాలను మేళవించి జనరంజకంగా గాన యోగ్యంగా గజళ్లు రచించారని కీర్తించారు. మరిన్ని గజళ్లు రావాలని ఆకాక్షించారు. నేటి నిజం సాంపదకుడు బైసాదేవదాసు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఆచార్య ముకుంద సుబ్రహ్మణ్య శర్మ, సాహితీవేత్త డా.సంగభట్ల నరసయ్య, రచయిత ఇరువింటి వెంకటేశ్వర్లు, కవి రఘువీర్ ప్రతాప్, సంస్థ అధ్యక్షుడు డా.పోరెడ్డి రంగయ్య పాల్గొన్నారు.