హైదరాబాద్

వెల్లువెత్తిన చైతన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : దేశంలోని మహానగరాలు, పట్టణాల్లో నూటికి నూరు శాతం స్వచ్ఛత, పరిశుభ్రతను సాధించేందుకు కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ్భారత్ మిషన్ నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరాన్ని అగ్ర స్థానంలో నిలిపేందుకు జీహెచ్‌ఎంసీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు స్వచ్ఛ కార్యక్రమాలను నిర్వహించటంతో పాటు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పారిశుద్ద్యం పనులను నేరుగా మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దాన కిషోర్ కూడా ఎప్పటికపుడు తనిఖీలు చేస్తున్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే ఏమిటీ? అందులో నగరవాసులు భాగస్వామ్యమేమిటీ? అనే విషయాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు శుక్రవారం నగరంలోని 30 సర్కిళ్ల పరిధిలో భారీగా అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించారు. ‘సాఫ్ హైదరాబాద్.. షాన్‌దార్ హైదరాబాద్’ నినాదంతో నిర్వహించిన ఈ చైతన్య ర్యాలీలు, ఊరేగింపుల్లో స్కూల్ విద్యార్థులు, బల్దియా సిబ్బంది మొత్తాన్ని కూడా భాగస్వామ్యం చేశారు. ఈనెల 31వ తేదీ వరకు నగరంలో స్వచ్ఛ బృందాలు పారిశుద్ద్యం, స్వచ్ఛ కార్యక్రమాలపై సర్వే నిర్వహించనున్నందున, కేవలం సర్వే సమయానికే పరిమితం కాకుండా రానున్న ఆరు నెలల పాటు స్వచ్ఛ, పారిశుద్ద్య కార్యక్రమాలు ఇదే స్పూర్తితో కొనసాగేందుకు వీలుగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలను పర్యవేక్షించటంతో పాటు ఎప్పటికపుడు జోనల్, డిప్యూటీ కమిషనర్లతో పాటు స్వచ్ఛ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. రోడ్లపై గుంతలు లేకుండా పూర్తి స్థాయిలో రీకార్పెటింగ్, మరమ్మతులు నిర్వహించటం, నీటిని నగరవాసులు వృథాగా రోడ్లపై వదలకుండా వారిలో చైతన్యం కల్పించటం, బహిరంగ మల, మూత్ర విసర్జనల నివారణల కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ప్రతి కమర్షియల్ ప్రాంతంలో ప్రతి 500 మీటర్లకు రెండు డస్ట్‌బిన్లను ఏర్పాటు చేయటం, పర్యాటక, కమర్షియల్ ప్రాంతాల్లో చెత్త లేకుండా చేయటం, వంద కిలోలకు పై చిలుకు చెత్తను ఉత్పత్తి చేసే వ్యాపార సంస్థలు సొంతగా కంపోస్టు యూనిట్లను ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో ఖచ్చితంగా అమలయ్యేలా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.
అప్రమత్తంగా ఉండే పరిస్థితి
తీసుకురావాలి: మేయర్ బొంతు
నగరంలో ఎక్కడబడితే అక్కడ చెత్త వేయటం, రోడ్లపై మూత్ర విసర్జన చేయటం, వృథాగా నీటిని వదలటం వంటి చేసే వారిని గుర్తించి, వారికి భారీగా జరిమానాలు విధించే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను చేపట్టి, నగర ప్రజలు ఎప్పటికపుడు అప్రమత్తంగా ఉండే పరిస్థితి తీసుకురావాలని అధికారులను మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశించారు. స్వచ్ఛ అవగాహన కార్యక్రమాల సందర్భంగా మాట్లాడుతూ ఇండోర్ నగరాల్లో మున్సిపల్ అధికారులు, సిబ్బంది అంటే ఆయా నగరాల ప్రజలు భయపడుతారని, ఎందుకంటే నగర స్వచ్ఛతకు భంగం కల్గించే వారు అక్కడి అధికారులు భారీగా జరిమానాలు విధిస్తున్నందున, స్వచ్ఛతకు భంగం వాటిల్లకుండా ప్రజలు భయపడుతారని, ఇలాంటి పరిస్థితి నగరంలో వస్తే నూటికి నూరు శాతం స్వచ్ఛత సాధించటం ఖాయమని అభిప్రాయపడ్డారు. స్వచ్ఛతపై అవగాహన పెంపొందించేందుకు ఎంచుకున్న ‘సాఫ్ హైదరాబాద్..షాన్‌దార్ హైదరాబాద్’ నినాదంతో నగరానికి సరికొత్త రూపు తీసుకురానున్నట్లు మేయర్ రామ్మోహన్ తెలిపారు.