హైదరాబాద్

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: పూర్వ యజ్ఞ కళాపీఠం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ నృత్య గురువు పద్మశ్రీ శోభానాయుడుకి ఆత్మీయ సత్కార కార్యక్రమం శనివారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి కళాతపస్వీ పద్మశ్రీ డా.కే.విశ్వనాథ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణచారి, సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం పాల్గొని శోభానాయుడికి ఆత్మీయ సత్కారం చేశారు. కూచిపూడి నాట్యంలో విశిష్ట స్థానాన్ని పొందిన బహుకొద్ది కళాకారులలో పద్మశ్రీ శోభానాయుడు ఒకరని పేర్కొన్నారు. శోభానాయుడు కళాకారిణిగానే కాకుండా ఉపాధ్యాయురాలిగా రాణించారని తెలిపారు. ముల్నూరి యజ్ఞ చిన్న వయస్సులోనే నాట్య రంగంలోకి ప్రవేశించి నృత్య రంగంలో రాణిస్తున్నారని వివరించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వెంపటి చిన్న సత్యం వద్ద శిక్షణ పొంది అనేక ప్రదర్శనలు ప్రదర్శించారని తెలిపారు. ముట్నూరి యజ్ఞ ప్రదర్శించిన పలు నృత్యంశాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.
అలరించిన రామాచారి సంగీతోత్సవం
కాచిగూడ, జనవరి 19: ఢిల్లీ తెలుగు అకాడమి, లిటిల్ మ్యుజీషీయన్స్ అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో ‘రామాచారి లలిత’ సంగీతోత్సవం శనివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య పాల్గొని రామాచారి శిష్య బృందాని అభినందించి సత్కారించారు. రామాచారి సంగీత రంగంలో రాణించడం అభినందనీయమని అన్నారు. లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమి స్థాపించి అనేక మంది విద్యార్థులకు సంగీత రంగంలో శిక్షణ ఇస్తూ.. వారిని ప్రొత్సహిస్తుందని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బులుసు శివ శంకర్ రావు, సాహితీవేత్త డా.సీ.మధుసూదన రావు, సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం పాల్గొన్నారు.
ఎన్‌టీ రామారావు చిరస్మరణీయుడు
కాచిగూడ, జనవరి 19: నందమూరి ఎన్‌టీ రామారావు చిరస్మరణీయుడని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. నందమూరి తారక రామారావు 23వ వర్థంతి సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ‘ఎన్‌టీఆర్’ సేవా పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో స్వరమాధురి సాంస్కృతిక సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఠాగోపాల్ వివిధ రంగాల్లో సేవలందించిన వారికి సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. ఎన్‌టీఆర్ తన జీవితం ప్రజా సేవకే అంకితం చేశారని పేర్కొన్నారు. ఆయన పేరిట పురస్కారాలను ప్రదానం చేయడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ గాయనీ సాయిపావని నిర్వహణలో గాయనీ, గాయకులు అలపించిన సినీ గీతాలు అలరించాయి. కార్యక్రమంలో గాయకుడు త్రినాథ రావు, శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్ర ప్రసాద్, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు సాయిపావని, అంజి పాల్గొన్నారు.