హైదరాబాద్

736 ఆక్రమణల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటైన ఆక్రమణలను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు శనివారం మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బల్దియా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ డ్రైవ్‌లో శనివారం ఒక్కరోజే 449 ఆక్రమణలను తొలగించాలని అధికారులు భావించినా, 3.07 కిలోమీటర్ల రూట్‌లో 449తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తొలగించిన ఆక్రమణలు కలిపి ఒక్కరోజు మొత్తం సుమారు 736 ఆక్రమణలను తొలగించినట్లు విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. ఇప్పటికే గతంలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో 13వేల 600 ఆక్రమణలను జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో తొలగించారు. శనివారం తొలగించిన 736 ఆక్రమణలతో కలిపి ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ 13600 ఆక్రమణలను తొలగించింది. టౌన్‌ప్లానింగ్, యూసిడీ, ఇంజనీరింగ్‌తో పాటు ట్రాఫిక్, లాఅండ్‌ఆర్డర్ పోలీసు విభాగాలను సమన్వయం చేసుకుని, ఈ డ్రైవ్‌ను ప్రశాంతంగా నిర్వహించారు. టాటా షోరూం నుంచి ఆల్విన్ క్రాస్ రోడ్డు వరకు, ఎక్సైజ్ పోలీసు స్టేషన్ నుంచి ఆర్‌సీపురం పోలీస్‌స్టేషన్ మంజీర పైప్‌లైన్ రోడ్డు మార్గాల్లో ఆరు బృందాలు ఈ అక్రమ కట్టడాలను కూల్చివేశాయి. ప్రధానంగా రహదారులపై పాదచారులకు అడ్డంగా శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసిన దుకాణాలను మాత్రమే కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. పేదలు తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసుకున్న వాటివైపు వెళ్లకుండా ఈ తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. నగరంలోని ఫుట్‌పాత్‌లపై అక్రమ నిర్మాణాలు తొలగించాలని హైకోర్టు పలు సార్లు జీహెచ్‌ఎంసీకి ఆదేశాలు జారీ చేయటంతో ఈ స్పెషల్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టామని, దీనికి ప్రజల నుంచి కూడా చక్కటి స్పందన, సమన్వయం లభిస్తోందని డైరెక్టర్ విశ్వజిత్ వెల్లడించారు.