హైదరాబాద్

ఆకట్టుకున్న లోహిరి మేళా-2019

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం ప్రారంభంలో పంజాబీలు అంత కలిసి జరుపుకునే ఉత్సావాల్లో ‘లోహిరి మేళా’ను సికింద్రాబాద్‌లోని మహబూబీయా కాలేజీలో ఆదివారం నిర్వహించారు. పంజామీ సేవ సమితి, తెలంగాణ పంజాబీ సేవ సమితిల సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీపీ తేజ్‌దీప్ కౌర్ విచ్చేసి జ్యోతిప్రజ్వాలన చేసి లోహిరి మేళాను ప్రారంభించారు. మేళాకు వివిధ ప్రాంతాలకు చెందిన 1500 మంది పంజాబీలు హాజరయ్యారు. కార్యక్రమంలో ఏయిర్ వైస్ మార్షల్ డీఎన్ గౌరీ, పంజాబీ సేవ సమితి అధ్యక్షుడు సునీల్ కుమార్ పూరి, తెలంగాణ పంజాబీ సభ మాజీ అధ్యక్షుడు మంజిత్ సింగ్ గాంధీ, ప్రదీప్ కుమార్ లుంబా, రాజేంద్ర సింగ్ సులోజ, రోడ అతుల్ ఖన్నా, ప్రేమ్ కపూర్, రమేష్ పాసీ, డాక్టర్ సలోజ, నీవన్ పానీ పాల్గొని మేళా విశిష్టతను వివరించారు. పంజాబీ పాప్ సింగర్ హనీత్ తానేజా ఆట పాటలతో ఆహూతులను హోరేత్తించారు. మేళా వేడుకలను ఎప్పటికపుడు సునీల్ కుమార్ పూరి, మంజీత్ సింగ్ గాంధీ పర్యవేక్షించారు.
తెలంగాణలో కొనసాగే ప్రయత్నాలను సహించం
ఖైరతాబాద్, జనవరి 20: కుట్రపూరితంగా తెలంగాణలో కొనసాగే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితిలో సహించబోమని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఆదివారం ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శివాజీ, మధుసూదన్ మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా విద్యుత్ ఉద్యోగుల విభజన పూర్తికాలేదని అన్నారు. ఏపీ విద్యుత్ సంస్థలు, అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతోనే విభజన సంక్లిష్టంగా మారుతుందని విమర్శించారు. విభజన విషయమై నియమించిన జస్టిస్ ధర్మాధికారి కమిషన్‌కు తమ వాదనను వినిపించినట్టు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అక్రమ పద్ధతుల్లోనియమితులైన వారు రాష్ట్ర విభజన అనంతరం ఇక్కడే తిష్టవేయాలనే తలంపుతో ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని వివరించినట్టు తెలిపారు. విద్యుత్ సంస్థలో ఉద్యోగాలన్నీ స్థానికులకే రావాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ప్రభుత్వాల అండతో ఏపీకి చెందినవారు 40 శాతానికిపైగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం అక్కడి స్థానికతను గుర్తించి 1157మందిని రిలీవ్ చేసిందని చెప్పారు. ఉద్యోగులు సైతం అక్కడికి వెళ్లేందుకు సిద్దపడ్డా, ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వారిని చేర్చుకోలేదని అన్నారు. దీంతో సంస్థలో నియామకాలు, పదోన్నతులు నిలిచిపోయే పరిస్థితి తలెత్తిందని తెలిపారు. ఇప్పటికైనా ఇరు ప్రభుత్వాలు ఈ సమస్యను జటిలం చేయకుండా సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. సమావేశంలో అశోక్, రవి పాల్గొన్నారు.