హైదరాబాద్

వ్యర్థాల శుద్ధికి 18 ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షణ్-2019 సర్వే నిమిత్తం కేంద్ర స్వచ్ఛ్భారత్ మిషన్ ఉన్నతాధికారుల బృందం నగరానికి చేరుకుంది. వివిధ ప్రాంతాల్లో నేటి నుంచి స్వచ్ఛ బృందాలు పర్యటించి పారిశుద్ధ్యం, స్వచ్ఛతపై క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకునే అవకాశముండటంతో నగరానికి ఎక్కువ మార్కులు వచ్చేలా జీహెచ్‌ఎంసీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా బహిరంగ మల, మూత్ర విసర్జనలేని నగరం (ఓడీఎఫ్ సిటీ)గా గుర్తింపు పొందిన నగరాన్ని ఓడీఎఫ్ ప్లస్ ప్లస్‌గా తీర్చిదిద్దేందుకు తమకు సహకరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ నగరవాసులకు బహిరంగ లేఖ రాశారు. నగరంలో వ్యర్థాలను శాస్ర్తియంగా శుద్ధి చేసేందుకు వివిధ ప్రాంతాల్లో 18 ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయునున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. దీనికితోడు నగరంలోని పబ్లిక్ టాయిలెట్ల నుంచి వచ్చే వ్యర్థాలను అనుమతిచ్చిన సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ల ద్వారా శాస్ర్తియంగా శుద్ధి చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని వివిధ పనులపై బయటకు వచ్చే ప్రజల కోసం, వివిధ రకాల వాణిజ్య అవసరాల కోసం వచ్చే ప్రజల కోసం 313 పబ్లిక్ టాయిలెట్లను నిర్మించినట్లు తెలిపారు. నగరంలోని పెట్రోల్ బంకులు, కమర్షియల్ కాంప్లెక్సు, హోటళ్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాల్లోని టాయిలెట్లను కూడా నగరవాసులకు అందుబాటులో ఉండేలా వాటి యజమానులను ఒప్పించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులకు, సిబ్బందికి సరిపడే నీటి వసతితో కూడిన మరుగుదొడ్లున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి ధృవీకరణ పత్రాలు స్వీకరించినట్లు వెల్లడించారు. దీంతో పాటు స్వయం సహాయక సంఘాలు సైతం ఓడీఎఫ్ నుంచి ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ నగరంగా ప్రకటిస్తూ తీర్మానం చేసినట్లు వివరించారు. ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ ప్రొటోకాల్‌లో సూచించిన విధంగా పారిశుద్ధ్యానికి సంబంధించి అన్ని నియమ నిబంధనలను అమలు చేయటం జరుగుతుందని, ఇందుకు నగరవాసులు కూడా బల్దియా చేపట్టే కార్యక్రమాలకు సహకరించాలని కమిషనర్ దాన కిషోర్ సూచించారు.