హైదరాబాద్

మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన మొదటి విడత ఎన్నికల్లో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 93శాతం పోలింగ్ నమోదైంది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో జిల్లాల్లో ప్రశాంతంగా జరుగగా అక్కడక్కడ చెదురు మదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. సోమవారం మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 93శాతం పోలింగ్ నమోదైంది. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలంలో 96శాతం, నందిగామ మండలంలో 93శాతం, కొందుర్గు మండలంలో 93శాతం, చౌదరిగూడ మండలంలో 91శాతం, కేశంపేట మండలంలో 93శాతం, ఫరూఖ్‌నగర్ మండలంలో 94శాతం, శంషాబాద్ మండలంలో 90శాతం పోలింగ్ నమోదైంది. గ్రామాలలో మొత్తం 16155 ఓట్లు పోలు కాగా వీరిలో 82276 పురుషులు, 79283 స్ర్తిలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 17434 ఓటర్లు ఉన్నారు. ఓటర్లు ఓటింగ్ కేంద్రాలకు బాగానే తరలి రావడంతో ఉదయం తొమ్మిదింటి వరకు 32శాతం, 11గంటల వరకు 71శాతం, నిర్ణీత సమయానికి 93శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలంలో 12700మంది ఓటర్లు ఉండగా 12147మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 96శాతంగా పోలింగ్ నమోదైంది. నందిగామ మండలంలో 20899మంది ఓటర్లు ఉండగా 19529మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 93శాతం పోలింగ్ నమోదైంది. కొందుర్గు మండలంలో 19539మంది ఓటర్లు ఉండగా 18090 ఓటు హక్కు వినియోగించుకోవడంతో 93శాతం పోలింగ్ నమోదైంది. చౌదరిగూడ మండలంలో 20341మంది ఓటర్లు ఉండగా 18491మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 91శాతం పోలింగ్ నమోదైంది. కేశంపేట మండలంలో 28546మంది ఓటర్లు ఉండగా 26529మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 93శాతం పోలింగ్ నమోదైంది. ఫరూఖ్‌నగర్ మండలంలో 38081మంది ఓటర్లు ఉండగా 35931మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 94శాతం పోలింగ్ నమోదైంది. శంషాబాద్ మండలంలో 34240మంది ఓటర్లు ఉండగా 30838మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 90శాతం పోలింగ్ నమోదైంది. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో అత్యధికంగా కొత్తూరు మండలంలో 96శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా శంషాబాద్ మండలంలో 90శాతం పోలింగ్ నమోదైంది.