హైదరాబాద్

25న ‘ఆణిముత్యాలు’కవితా సంపుటి ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జన్నాభట్ల నరసింహప్రసాద్ రచించిన ‘ఆణిముత్యాలు’ కవితా సంపుటి ఆవిష్కరణ సభను గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 25న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 25న సాయంత్రం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయగాన సభ, వేద ప్రచార పరిశోధనా సంస్థ, ఆచార్య శిప్రముని పీఠం సంయుక్త్ధ్వార్యంలో నిర్వహించనున్న ఈ ఆవిష్కరణ సభ 25న సాయంత్రం గానసభలో నిర్వహించనున్నట్ల తెలిపారు. మహాభారత నిఘంటు నిర్మాత త్రోవగుంట వేంకటసుబ్రహ్మణ్యం విచ్చేసి ఆశీఃప్రసంగం చేసే కార్యక్రమానికి సమాజ సేవకులు వైఎస్‌ఆర్ మూర్తి ముఖ్య అతిధిగా విచ్చేయగా, శ్రీ త్యాగరాయగాన సభ అధ్యక్షులు కళా జనార్దనమూర్తి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఈ కవితా సంపుటిని రచయిత నోర సుబ్రహ్మణ్యశాస్ర్తీకి అంకితం చేయనున్నట్లు, కృతి స్వీయకర్త రచయితను సత్కరించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా సంగీత విధ్వంసులు ఎసీసీ శాస్ర్తీ 75 సంవత్సరాల వజ్రోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించనున్నట్లు తెలిపారు. సభలో డాక్టర్ నిడమర్తి నిర్మల రచించిన ‘జాతీయోద్యమంలో దుర్గ్భాయమ్మ’ అనే సంగీత నృత్య రూపం ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

కృష్ణ శర్మ సాహిత్య రంగానికి చేసిన సేవలు మరువలేనివి
కాచిగూడ, జనవరి 21: ప్రముఖ సాహితీవేత్త రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ సాహిత్య రంగనికి చేసిన సేవలు మరువలేనివని పలువురు వక్తలు అన్నారు.
అనంత కృష్ణ శర్మ జయంతి సభ శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో సోమవారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి విశ్వసాహితీ అధ్యక్షుడు జయ రాములు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, రచయిత్రి లక్కరాజు నిర్మల, టీవీ రావు పాల్గొని అనంత కృష్ణ శర్మ చిత్రపటానికి నివాళి అర్పించి ఆయన సాహిత్య రంగానికి చేసిన సేవలను వారు గుర్తు చేశారు.
సప్తస్వర మాలిక సేవలు అభినందనీయం
కాచిగూడ, జనవరి 21: సప్తస్వర మాలిక సాంస్కృతిక సంస్థ కళా రంగానికి చేస్తున్న సేవలు అభినందనీయమని లయన్ విజయ్‌కుమార్ అన్నారు. స్వప్తస్వర మాలిక సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో హిందీ, తెలుగు మధుర గీతాల సంగీత విభావరి సోమవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విజయ్ కుమార్ గాయనీ, గాయకులను సత్కరించి అభినందించారు.
ప్రముఖ గాయకుడు మురళీధర్ నిర్వహణలో గాయనీ, గాయకులు డా.రామనారాయణ, డా.సుందర్, డా.సతీష్, డా.సుమశ్రీ, నందిత జ్యోతి, వేణుగోపాల రావు, సుజారమణ, విజయ్‌కుమార్ అలపించిన హిందీ, తెలుగు సినీగీతాలు అలరించాయి. కార్యక్రమంలో గానసభ కళా జనార్దన మూర్తి, స్పెషల్ జడ్జి జనమంచి సాంబశివ, న్యాయవాది భూపాల్ రాజ్ పాల్గొన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరణ

హైదరాబాద్, జనవరి 21: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన సంవత్సరానికి రూపొందించిన క్యాలెండర్‌ను కమిషనర్ దాన కిషోర్ సోమవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బి. నర్సింగ్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంటు మల్లేశ్, వైస్ ప్రెసిడెంటు ఇ.రఘుపతి, జనరల్ సెక్రటరీ పి. మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.