హైదరాబాద్

శివకుమారస్వామి మరణం దేశానికి తీరని లోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: సిద్దగంగ మఠం పీఠాదిపతి శివకుమార స్వామి మరణం దేశానికి తీరని లోటని శ్రద్ధాంజలి సభలో పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో లింగాయత్ సమన్వయ సమితి ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి సభను నిర్వహించారు. సమితి నాయకులు అశోక్, శివరత్నం, సోమేశ్వర్ కవిత దేశ్‌ముఖ్ పాల్గొని నివాళి అర్పించారు. 111 ఏళ్ల పాటు జీవించిన స్వామిజీ ఆధ్యాత్మిక, విద్యా రంగంలో విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. సర్వమానవాళి సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన శివకుమార్ స్వామిని కర్నాటక రాష్ట్రంలో నడిచే దైవంగా కొలుస్తారని చెప్పారు. విద్యతోనే పేదరికాన్ని రూపుమాపవచ్చని ప్రగాఢంగా విశ్వసించిన స్వామిజీ.. ఎన్నో ఉన్నత విద్యా సంస్థలు నెలకొల్పి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించారని కొనియాడారు. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ నుంచి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వరకు స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారని తెలిపారు. స్వామి శివైక్యం యావత్ దేశానికి తీరని లోటని అన్నారు. సర్వప్రాణులలో దైవం ఉంటాడని నమ్మి సేవలు చేసిన స్వామికి భారతరత్న అవార్డును ఇవ్వాలని కోరారు.