హైదరాబాద్

రంగారెడ్డి జిల్లా టీఎన్‌జీఓస్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం రంగారెడ్డి జిల్లా 2019 సంవత్సరం డైరీని, క్యాలెండర్‌ను కేంద్ర టీఎన్‌జీఓస్ అధ్యక్షుడు కారం రవిందర్ రెడ్డి ఆవిష్కరించారు. జిల్లా టీఎన్‌జీఓస్ అధ్యక్షుడు కే.లక్ష్మన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రవిందర్ రెడ్డి మాట్లాడుతూ... ఉద్యోగ సమస్యల పై సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, పీఆర్‌సీని త్వరగా అమలు పర్చాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 21న ఏఐజీఎస్‌ఎఫ్ పిలుపు మేరకు సీపీఎస్ పై చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేంద్ర టీఎన్‌జీఓస్ ప్రధాన కార్యదర్శి రాజేందర్, నేతలు దేవీ ప్రసాద్ రావు, శ్రీనివాస్ గౌడ్, బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ రావు, మజీబ్, ప్రతాప్, నిరంజన్ రెడ్డి, రవిప్రకాష్, సలీమ్ మియా, విజయకుమార్, ఆనంద్ సింగ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.