హైదరాబాద్

ప్రతి ఇంటికీ వెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగర ఓటరు జాబితా సవరణ సవరణలో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్లంతా తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ పరిధిలోని ప్రతి ఇంటినీ సందర్శించి, జాబితాలోని తప్పోప్పులను సవరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ ఆదేశించారు. బుధవారం ప్రధాన కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఓటరకు సీఇఓ పంపిన ప్రత్యేకమైన లేఖ వస్తుందని, దాన్ని స్వీకరించి, దాంతో పాటు ఉన్న కార్డుపై తమ అడ్రస్‌ను రాసి తిరిగి పంపాలని సూచించారు. ఈ నెల 25 వరకు నిర్వహించాలనుకున్న ఓటరు జాబితా సవరణ వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈనెల 19వ తేదీ నుంచి ప్రతి పోలింగ్ స్టేషన్‌లో సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఓటరు జాబితాతో ప్రజలకు బీఎల్‌ఓలు అందుబాటులో ఉండే ప్రత్యేక కార్యక్రమాన్ని గురువారంతో ముగించనున్నట్లు తెలిపారు. ప్రతి బీఎల్‌ఓ ప్రతి ఇంటికి నేరుగా వెళ్లి ఓటర్ల వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని, ఏ మాత్ర నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని దాన కిషోర్ హెచ్చరించారు. నగరంలోని ప్రతి ఓటరు విధిగా పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి తమ ఓటు ఉందా లేదా? అనే విషయాన్ని సరిచూసుకోవాలని, లేని పక్షంలో నమోదు కోసం, ఒక వేళ తప్పులు ఉంటే సరి చేసుకునేలా దరఖాస్తులు సమర్పించుకోవాలని సూచించారు. గురువారం తర్వాత కూడా ఓటరు జాబితా సవరణ జరిగేందుకు వీలుగా నగరంలోని అన్ని వార్డు కార్యాలయాల్లో సవరణ ప్రక్రియ సక్రమంగా జరిగేందుకు వీలుగా ఓటరు జాబితాతో పాటు కంప్యూటర్ ఆపరేటర్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. దీనికి తోడు జన సంచారమెక్కువగా ఉండే 11 మాల్స్‌ల వద్ద ఓటరు జాబితాలోని తప్పులను సరి చేసుకునేందుకు ఫారం-7, 8, 8ఏ అలాగే కొత్త ఓటర్ల నమోదు చేసుకోవం ఫారం-6ను అందుబాటులో ఉంచి, ప్రత్యేకంగా డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి తప్పులు, లోపాల్లేని ఓటరు జాబితాను రూపొందించేందుకు ఎన్నికల సిబ్బంది పారదర్శకతతో విధులు నిర్వర్తించటంతో పాటు ప్రజలు కూడా సహకరించాలని దాన కిషోర్ కోరారు.