హైదరాబాద్

‘ఐడియా’ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బషీర్‌బాగ్‌లోని ఖాన్ లతీఫ్ ఖాన్ భవనంలో ఉన్న ఐడియా సెల్‌ఫోన్ సర్కిల్ ప్రధాన కార్యాలయంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎలాంటి ప్రాణ హాని జరగకపోయినా, నష్టం పెద్ద మొత్తంలోనే ఉడవచ్చునని అధికారులు అంచనాలు వేస్తున్నారు. బుధవారం ఉదయం ఒక్కసారిగా 2, 6, 7 అంతస్తుల నుంచి పొగ రావటంతో గమనించిన వందలాది మంది సిబ్బంది ఒక్కసారిగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు ఉరుకులు, పరుగులు పెట్టారు. సమాచారం అందించటంతో రంగంలో దిగిన జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ రెస్క్యు ఫోర్స్(డీఆర్‌ఎఫ్), నాలుగు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు గంటల తరబడి చేసిన ప్రయత్నం ఫలించింది. ప్రమాదానికి ప్రాథమికంగా షార్ట్ సర్క్యూటే కారణమని జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఆరు, ఏడు అంతస్తులను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేశారు. భవనంలో అగ్నిప్రమాద నివారణ ప్రమాణాలు ఉన్నాయా లేదా? ప్రమాదానికి కారణాలేమిటీ? అనే కోణంలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు విచారణలు చేపట్టారు.