హైదరాబాద్

పారిశుద్ధ్యం మెరుగుకు ‘స్వచ్ఛ విజిల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు జీహెచ్‌ఎంసీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోనుంది. రోడ్లపై ఎక్కడబడితే అక్కడ చెత్త వేసేవారిని గుర్తించి, ఇప్పటికే జరిమానాలను విధిస్తున్న జీహెచ్‌ఎంసీ ఇందుకు ప్రత్యేక వాహనాలను ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాని పక్షంలో ఎవరైనా రోడ్డుపై చెత్త వేస్తే అది పౌరులెవరైనా ఫొటో తీసి పంపినా, జరిమానాలు వసూలు చేసేందుకు వీలుగా ‘స్వచ్ఛ విజిల్’ యాప్‌ను ప్రవేశపెట్టేందుకు జీహెచ్‌ఎంసీ సిద్దమైంది. వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ తెలిపారు. అంతకన్నా ముందు ఆరు జోన్లలో ఆరు నానో కార్లతో నిఘా పెట్టి, జరిమానాలు విధించనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కొక్క నానో కారులో మూడు, నాలుగు కెమెరాలను ఏర్పాటు చేసి, రోజుకో వీధిలో ఈ కారును నిలపనున్నారు. ఆయా వీధుల్లో ఆ కారులోని నిఘా నేత్రాలు రోడ్లపై చెత్తవేసే వారి ఫొటోలు తీసి, ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు పంపేలా ఏర్పాట్లు చేశారు.
మానవ ప్రమేయం లేకుండా చెత్త వేసిన ఇంటి యజమానికి నేరుగా కమాండ్ కంట్రోల్ జరిమానా విధించేలా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే సిద్ధమైన ఓ నానో వాహనాన్ని తొలి దశగా ఖైరతాబాద్ జంక్షన్‌లో ఉంచుతామని, త్వరలోనే నగరంలోని అన్ని జోన్లలో జోన్‌కు ఒకటి చొప్పున ఇలాంటి వాహానాలు అందుబాటులో రానున్నట్లు కమిషనర్ దాన కిషోర్ తెలిపారు.
స్పెషల్ వాహనం అంటే?
మెరుగైన పారిశుద్ద్యం కోసం జీహెచ్‌ఎంసీ వినియోగించనున్న స్పెషల్ వాహానం అంటే నానో కారుకు మూడు వైపులా మూడు కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. 360 డిగ్రీలు నిఘా పెడుతూ, చెత్త వేసిన వారి ఫొటోలను క్యాప్‌చర్ చేసేందుకు మరో కెమెరాలతో కలిపి మొత్తం నాలుగు కెమెరాలు, తీసిన ఫొటోను కమాండ్ కంట్రోల్‌కు పంపేందుకువీలుగా కారులో కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
మున్ముందు నగరంలో స్వచ్ఛ కార్యక్రమాలను ముమ్మరం చేయటంతో పాటు ఈ నెలాఖరు వరకు సర్వేక్షణ్ ముగిసినా, రానున్న మరో ఆరు నెలల పాటు కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించేందుకు జీహెచ్‌ంసీ ఏర్పాట్లు చేస్తోంది. వార్డుకో ట్యాబ్‌ను అధికారులకు పంపిణీ చేయనున్నారు. అధికారులు ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి పదకొండు గంటల్లోపు క్షేత్ర స్థాయిలో పారిశుద్ద్య కార్మికుల పనితీరు, శుభ్రపరిచిన ప్రాంతాల ఫొటోలతో కూడిన వివరాలను కమాండ్ కంట్రోల్ రూంకు పంపాల్సి ఉంటుంది. ఈ విధుల్లో ఎవరు నిర్లక్ష్యం వహించినా, కఠిన చర్యలు తప్పవని కమిషనర్ దాన కిషోర్ హెచ్చరించారు.