హైదరాబాద్

ఆదాయ వనరులపై బల్దియా దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: ప్రస్తుతం ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న మహానగర పాలక సంస్థ మున్ముందు తలెత్తనున్న సమస్యలను అధిగమించే అంశంపై ఇప్పటి నుంచే దృష్టి సారించింది. ప్రస్తుతమున్న ఆదాయ వనరులు గాక, ఇంకా ఎక్కడెక్కడి నుంచి ఆదాయం సమకూరే అవకాశముందన్న విషయంపై దృష్టి సారించారు. మరిన్ని ఆదాయమార్గాలను పెంపొందించే దిశగా ప్రతి అధికారి కృషి చేయాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై ఆయన శనివారం ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సు, టౌన్‌ప్లానింగ్‌ల ద్వారానే బల్దియాకు ప్రదానంగా ఆదాయం సమకూరుతోంది. అయితే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దటంలో భాగంగా ఎస్‌ఆర్‌డిపి మల్టీలేవెల్ పార్కింగ్, మోడల్ మార్కెట్లు, పార్కులు, క్రీడామైదానాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలను బల్దియా పెద్ద ఎత్తున చేపడుతోంది. వీటి నిర్వహణకు భారీ ఎత్తున నిధులు అవసరం కానున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పన్నుల విధానంలో ఏ విధమైన మార్పులు లేకుండానే జిహెచ్‌ఎంసి ఆస్తులను పూర్తి స్తాయిలో వినియోగించుకోవాలని, వీటిని ఆదాయ వనరులుగా మార్చుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ క్రమంలో నగరంలోని స్పోర్ట్స్ కాంప్లెక్సులను అద్దెకు ఇవ్వాలని కూడా నిర్ణయించారు.
ప్రస్తుతం గ్రేటర్‌లోని 521 క్రీడామైదానాలు , 9 బ్యాడ్మింటన్ కోర్టులు, తొమ్మిది ప్రధాన క్రీడా కాంప్లెక్సుల నుంచి కూడా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇవి కేవలం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఇలా కాకుండా ఇవి పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా, అవసరమైతే అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వేర్వేరుగా అద్దెకు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ సమావేశంల అదనపు కమిషనర్లు సురేంద్రమోహన్, శివకుమార్ నాయుడు, శంకరయ్య, భాస్కరచారి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
పార్కింగ్ వ్యవస్థలో మార్పుల యోచన
ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని 53 పెయిండ్ పార్కింగ్ యార్డు వ్యవస్థలో పూర్తి స్థాయిలో మార్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. వీటిలో కేవలం మూడు పార్కింగ్‌ల నుంచి అధికారులు ఆశించిన స్థాయిలో లాభం రాకపోవటంపై ప్రధానంగా దృష్టి సారించాలని భావిస్తున్నారు.
ఈ పార్కింగ్ యార్డుల ద్వారా కాంట్రాక్టర్లు, ప్రైవేటు సంస్థలు వంద కోట్లు సంపాదించుకుంటుంటే, బల్దియాకు మాత్రం అంతంతమాత్రంగానే ఆదాయం వస్తోంది. ఈ క్రమంలో పార్కింగ్ యార్డుల కాంట్రాక్టు వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నగర పోలీసు శాఖ చేసిన సిఫార్సుల మేరకు ప్రజలకు ఉచితంగానే పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తే పూర్తిగా అక్రమాలకు చెక్ పెట్టవచ్చునన్న విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. లేని పక్షంలో వీటిని వేలం వేసే సమయంలో కాంట్రాక్టర్లు రింగు కాకుండా జాగ్రత్త పడితే ఆశించిన ఆదాయం సమకూరవచ్చునని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
డిప్యూటీ కమిషనర్ల
పరిధిలోకి కమ్యూనిటీ హాళ్లు
నగరంలోని వివిధ ప్రాంతాల్లోని కాలనీ, బస్తీ కమ్యూనిటీ హాళ్లు పలువురు రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయన్న విషయాన్ని సైతం కమిషనర్ సమీక్షలో ప్రస్తావిస్తూ, వీటిని వెంటనే డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలోకి తీసుకోవాలని ఆదేశించారు.
అవసరమైతే వీటిని స్థానిక స్వయం సహాయక బృందాలకు అప్పగించాలని కూడా సూచించారు. వీటి ద్వారా బల్దియాకు ఆదాయం పెంచే మార్గాలను అనే్వషించాలని ఆదేశించారు. ఇందుకు గాను జిహెచ్‌ఎంసి ఆస్తుల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలన్నారు.
జిహెచ్‌ఎంసికి చెందిన పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, క్రీడామైదానాలు, శ్మశనవాటికలు, ఖాళీ స్థలాల వివరాలను జియో బోగింగ్ చేసే వెబ్‌సైట్‌లో ఉంచాలన్నారు. జిహెచ్‌ఎంసికి చెందిన ప్రతి ఆస్తికి సూచికలు పెట్టాలని, ఆయా వెబ్‌సైట్‌లో వివరాలు ప్రదర్శన వల్ల జిహెచ్‌ఎంసి వివరాలను నగర ప్రజలు తెల్సుకునేందుకు వీలుగా కల్గుతుందన్నారు.
‘కార్పొరేట్’ బాధ్యతపై ప్రత్యేక దృష్టి
జిహెచ్‌ఎంసి చేపట్టే పలు అభివృద్ది పనుల్లో కార్పొరేట్ సొషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ సంస్థలు పాల్గొనేలా కృషి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పార్కుల నిర్వహణ, సోలార్ విద్యుత్ లైట్ల ఏర్పాట్లు, రూ. 5 భోజన పథకం, రోడ్ల నిర్వహణ తదితర అంశాలల్లో కార్పొరేట్ రంగాలను కలుపుకుని పోయి, పనులు చేపట్టాలన్నారు. సొషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంస్థలేమైనా ముందుకొస్తే ఆ పనుల ఆర్థిక భారం జిహెచ్‌ఎంసికి తగ్గే అవకాశముంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారా?
ప్రస్తుతమున్న ఆదాయ వనరుల ద్వారా పెద్దగా రెవెన్యూ సమకూరని పక్షంలో జిహెచ్‌ఎంసి అధికారులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. గతంలో బల్దియా ఆస్తులపై ఎస్‌బిహెచ్ నుంచి రూ. 600 కోట్లు రుణంగా తీసుకునేందుకు సిద్దమైన అధికారులు ఆ తర్వాత ఏం జరిగిందోగానీ రుణం తీసుకోకుంటా వౌనం వహించారు. కానీ ఇపుడు జిహెచ్‌ఎంసిలో నిధులు పుష్కలంగా ఉన్న రేపు ఎస్‌ఆర్‌డిపి పనులు ప్రారంభమయ్యాక వేల కోట్లలోనే చెల్లింపులు జరపాల్సి ఉన్నందున, ప్రస్తుతం ఎంచుకున్న ఆదాయ వనరుల నుంచి ఎంత వరకు రెవెన్యూ వస్తుంది? మిగిలిన దాన్ని ఎలా సమకూర్చుకుంటుందో వేచి చూడాలి!