హైదరాబాద్

ఆగని అక్రమ నిర్మాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్షేత్ర స్థాయిలో పర్యటించరు..ఆఫీసులో అందుబాటులో ఉండరు.. నిర్వర్తించాల్సి విధులను పట్టించుకోరు..నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్న నిర్మాణాలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోరు.. * మరికొందరు అక్రమార్కులైన అధికారులు
ఈ ఫిర్యాదులను అడ్డుగా పెట్టుకుని అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. కళ్లముందే కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా..కనీసం అడ్డుకోరు.. సందర్శన వేళల్లో సామాన్యులకు అందుబాటులో ఉండని ఈ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఎవరి కోసం..ఎందుకోసం విధుల్లో కొనసాగుతున్నారో? అనే చర్చ జరుగుతుంది.
హైదరాబాద్: మహానగరంలో అక్రమ నిర్మాణాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. నిర్మాణాల నిమిత్తం బల్దియా నుంచి తీసుకున్న అనుమతులను ఉల్లంఘించి నిర్మాణాలు జరుగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో అసలు అనుమతులు తీసుకోకుండానే నిర్మాణలు చేపడుతున్నారు. మల్కాజ్‌గిరి వంటి ప్రాంతాల్లో రౌడీలు, బల్దియా అధికారులు అండతో కొందరు నిర్మాణదారులు పక్క ప్లాట్లను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలను ప్రాథమిక స్థాయిలోనే అడుకోవల్సిన బల్దియా అధికారులకు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నా, వాటిని అడ్డుకోలేకపోతున్నారు. అక్రమ నిర్మాణాలను ఒక రకంగా బల్దియా టౌన్‌ప్లానింగ్ అధికారులు ప్రోత్సహించటంతో నిర్మాణదారులు రెచ్చిపోతున్నారు. అధికారులు తమ ఫిర్యాదులను పట్టించుకోకపోవటంతో బాధితులు కోర్టులను ఆశ్రయించగా, నిర్మాణాలను నిలిపివేయాలని, తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ కోర్టులు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసినా, కనీసం వాటిని కూడా అమలు చేసేందుకు కూడా బల్దియా అధికారులు ముందుకు రావటం లేదు. మల్కాజ్‌గిరి సర్కిల్‌లోని గీతానగర్‌లరో ఇంటి నెంబర్ 4-227లోని స్థలంలో జీ ప్లస్ 2 అంతస్తులకు అనుమతి తీసుకుని, అదనంగా మరో అంతస్తును అక్రమంగా నిర్మిస్తున్నారు. పక్క ప్లాట్ ఇంటి నెంబరు 4-226లోని స్థలాన్ని ఆక్రమించుకుని యజమాని నిర్మాణం జరుపుతున్నారు. ఇదే విషయమై ప్లాటు యజమాని సర్కిల్ ఆఫీసు మొదలుకుని, ప్రధాన కార్యాలయం వరకు ఫిర్యాదులు చేసినా, అధికారులు పట్టించుకోవటం లేదు. కొద్దిరోజుల క్రితం ఇదే సర్కిల్‌కు చెందిన టౌన్‌ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ నరేశ్, అతని అసిస్టెంటు రూ.80వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన సంగతి తెలిసిందే! గీతానగర్‌లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణానికి సంబంధించి గత నెల 25వ తేదీ వరకు కోర్టు స్టేటస్‌కో ఆదేశాలున్నా, దాన్ని ఉల్లంఘించి యజమాని నిర్మాణం చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలను ప్రారంభ దశలోనే అడ్డుకునేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పటి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇందులో భాగంగా అక్రమ నిర్మాణాలను ప్రాథమిక స్థాయిలోనే అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కేవలం ఫుట్‌పాత్‌పై ఆక్రమణల తొలగింపునకే పరిమితమైంది. కేవలం పిచ్చుకలపై బ్రహ్మస్త్రం సంధిస్తున్న విజిలెన్స్ అధికారులు బడా అక్రమ నిర్మాణాలను పట్టించుకోవటం లేదు.